Peddi Movie: ‘పెద్ది’ మూవీ సెట్ కు తిలక్ వర్మ.. సర్ ప్రైజ్ గిఫ్ట్‌తో సత్కరించిన రామ్ చరణ్.. ఏంటో తెలుసా?
టీ20 ప్రపంచకప్ లో అదరగొట్టిన హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ బుధవారం (మార్చి 18) పెద్ది సినిమా సెట్ కు వచ్చాడు. హీరో రామ్ చరణ్ తో పాటు చిత్ర బృందంతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ హీరోకు రామ్ చరణ్ ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి సత్కరించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈనెలలోనే విడుదల కావాల్సిన ఈ మెగా మూవీ అనూహ్యంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే తాజాగా పెద్ది మూవీ సెట్స్‌లో టీ 20 వరల్డ్ కప్ హీరో, టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశాడు. బుధవారం (మార్చి 18) మూవీ షూటింగ్ సెట్స్‌కు వెళ్లిన తిలక్ వర్మ హీరో రామ్ చరణ్‌తో పాటు చిత్ర బృందంతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తిలక్ వర్మకు ఓ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. పెద్ది మూవీ షూట్‌లో వాడిన పాత బ్యాట్‌ను తిలక్ వర్మకు బహుమతిగా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా వృద్ధి సినిమాపై బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్మాత్మకంగా తెరకెక్కుతోన్న పెద్ది సినిమాకు ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్న అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్‌లో నెంబర్ గేమ్.. రేసులో ఉన్న స్టార్స్ ఎవరు ??
Prabhas: ప్రభాస్ 2.0.. నయా స్టైల్ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే
వెండితెరకు కూడా తప్పని గ్యాస్ కష్టాలు.. షూటింగ్స్‌లో ఫుడ్ మెనూలో కోత
టాలీవుడ్ టార్గెట్ వెయ్యి కోట్లు… 2026 లోనూ అదే సీన్
బాలీవుడ్ వైపు చూస్తున్న సౌత్ బ్యూటీస్.. హిట్స్ లేని చోట వెళ్లి ఏం చేస్తారు
దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..
జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో
పాపం.. గోల్డ్ అనుకొని స్కెచ్ వేశారు.. చివరికి..
ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..
పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే
మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు
లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??

