టాలీవుడ్ టార్గెట్ వెయ్యి కోట్లు… 2026 లోనూ అదే సీన్
2025లో టాలీవుడ్ బాక్సాఫీస్ సందడి తగ్గింది. టాప్ స్టార్స్, పాన్ ఇండియా చిత్రాలు లేకపోవడంతో ఆశించిన వసూళ్లు రాలేదు. 2026లో వెయ్యి కోట్ల కల నిజమవుతుందని ఆశిస్తే, నిరాశ తప్పేలా లేదు. చరణ్ మినహా ఇతర పాన్ ఇండియా స్టార్ల సినిమాలు ఈ ఏడాది రావడం లేదు. కన్నడ, హిందీ చిత్రాలు భారీ టార్గెట్‌లతో దూసుకుపోతున్నాయి.
2025లో సౌత్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సందడి కనిపించలేదు. అగ్ర తారల సినిమాలు విడుదల కాకపోవడం, పాన్ ఇండియా చిత్రాల కొరతతో భారీ వసూళ్లు కరువయ్యాయి. 2026లో ఈ లోటు తీరుతుందని అభిమానులు ఆశించినా, మరోసారి నిరాశ తప్పేలా లేదు. వెయ్యి కోట్ల కల ఈ ఏడాది కూడా ఒక కలే అనిపిస్తోంది. 2026 సంక్రాంతికి విడుదలైన పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెంచే చిత్రాలు ఏవీ రాలేదు. సమీప భవిష్యత్తులో పెద్ది మినహా మరో పాన్ ఇండియా తెలుగు సినిమా లేదు. రామ్ చరణ్ మినహా అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు వంటి అగ్ర తారలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టాలీవుడ్‌లో ఈ స్తబ్ధతను కన్నడ, హిందీ సినీ పరిశ్రమలు అందిపుచ్చుకుంటున్నాయి. దురందర్, రామాయణ వంటి హిందీ చిత్రాలు, టాక్సిక్ వంటి కన్నడ సినిమా వెయ్యి కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. ఇతర పరిశ్రమల నుంచి భారీ చిత్రాలు క్యూ కడుతుండటంతో టాలీవుడ్ ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలీవుడ్ వైపు చూస్తున్న సౌత్ బ్యూటీస్.. హిట్స్ లేని చోట వెళ్లి ఏం చేస్తారు
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ ట్రైలర్.. అంచనాలను అందుకుందా ??
నా వరకు ఒకే ఒక్క హీరో.. ఆయనే మెగాస్టార్
Pawan Kalyan: శ్రీలీల డాన్స్ చేస్తే నేను చేయను.. శ్రీలీల షాక్
Pawan Kalyan: పవన్ పంచులకు సుమ షాక్.. ఈ వీడియో చూస్తే నవ్వే నవ్వు
సిలిండర్ కోసం 'చెప్పుల' క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!
శివాలయానికి వెళ్లారు.. హుండీ దోచారు.. దేవుడిని కూడ వదలరా
దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని యువకుడి ఘాతుకం!
తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు
కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి
తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఒకే బస్సులో విధులు
నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!

