టాలీవుడ్‌లో నెంబర్ గేమ్.. రేసులో ఉన్న స్టార్స్ ఎవరు ??
ప్రస్తుత తరం హీరోలు నిలకడగా హిట్స్ ఇవ్వలేకపోవడంతో నంబర్ వన్ ట్యాగ్ ఎవరికీ దక్కడం లేదు. గతంలో చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్ వంటివారు ఈ రేసులో ఉండేవారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌డమ్, కంటెంట్ ప్రాధాన్యత పెరగడంతో నంబర్ వన్ స్థానం తరచు మారుతోంది. ఏ రంగంలోనైనా నంబర్ వన్ ఎవరు అన్న చర్చ సర్వసాధారణం.
ఏ రంగంలోనైనా నంబర్ వన్ ఎవరు అన్న చర్చ సర్వసాధారణం. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో, గ్లామర్ ప్రపంచంలో ఈ నంబర్ వన్ చైర్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ స్థానాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ తీవ్రంగా కృషి చేస్తుంటారు. మరి ప్రస్తుతం మన టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరో ఎవరు అనే ప్రశ్న చాలా కాలంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ ప్రశ్నకు తడుముకోకుండా మెగాస్టార్ చిరంజీవి అని సమాధానం చెప్పేవారు. సుమారు మూడు దశాబ్దాల పాటు చిరంజీవి అగ్రస్థానంలో కొనసాగారు. తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానటుల కాలంలోనే చిరంజీవి అరంగేట్రం చేసి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మాస్ ఇమేజ్, భారీ అభిమాన గణం కారణంగా బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సమకాలీన హీరోలు బాక్సాఫీస్‌ను ఏలినా, టాప్ చైర్ మాత్రం చిరంజీవి ఖాతాలోనే ఉండిపోయింది. పదేళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉన్నా, ఆ స్థానాన్ని మరే హీరో భర్తీ చేయలేకపోయారు. రీ-ఎంట్రీ తర్వాత కూడా తన సత్తా చాటుకున్నారు. అయితే, చిరంజీవి సీనియర్ సెగ్మెంట్‌లోకి మారిన తరువాత, నంబర్ వన్ స్థానం మాత్రం ఖాళీగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ రేసులో చాలా మంది హీరోల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, నిస్సందేహంగా ఆ స్థానాన్ని ఆక్రమించిన వారు ఎవరూ లేరు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ప్రభాస్ 2.0.. నయా స్టైల్ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే
వెండితెరకు కూడా తప్పని గ్యాస్ కష్టాలు.. షూటింగ్స్‌లో ఫుడ్ మెనూలో కోత
టాలీవుడ్ టార్గెట్ వెయ్యి కోట్లు… 2026 లోనూ అదే సీన్
బాలీవుడ్ వైపు చూస్తున్న సౌత్ బ్యూటీస్.. హిట్స్ లేని చోట వెళ్లి ఏం చేస్తారు
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ ట్రైలర్.. అంచనాలను అందుకుందా ??
సిలిండర్ కోసం 'చెప్పుల' క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!
శివాలయానికి వెళ్లారు.. హుండీ దోచారు.. దేవుడిని కూడ వదలరా
దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని యువకుడి ఘాతుకం!
తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు
కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి
తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఒకే బస్సులో విధులు
నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!

