హైదరాబాద్ సుచిత్ర డ్రగ్స్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. థాయిలాండ్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియా స్మగ్లర్ అబ్డూజును ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 74 గ్రాముల కొకైన్‌ను ఆరు క్యాప్సుల్స్ రూపంలో మింగి, విమానంలో వచ్చి విసర్జన ద్వారా బయటకు తీసి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈగిల్ టీం నిఘా వల్ల ఈ విచిత్ర మార్గాన్ని ఎంచుకున్నాడు.