తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఉద్యోగులకు లేదా వారి జీవిత భాగస్వాములకు అందించే స్పెషల్ ఇంక్రిమెంట్‌ను ఇకపై నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆర్థిక భారం తగ్గించుకునేందుకే ఆర్టీసీ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.