AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇది అయ్యా మీ అసలు బాగోతం.. జనాలేమో ఆవురావురుమని తింటున్నారు..

ఏం తినేటట్టు లేదు... ఏం కొనేటట్టు లేదు...! ప్రతీదాన్ని కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. ఆఖరికి పన్నీరును సైతం కల్తీ చేస్తూ జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. లేటెస్ట్‌గా భాగ్యనగరంలో బట్టబయలైన కల్తీ బాగోతం భయబ్రాంతులకు గురిచేస్తోంది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ...

Hyderabad: ఇది అయ్యా మీ అసలు బాగోతం.. జనాలేమో ఆవురావురుమని తింటున్నారు..
Adulterated Paneer
Ram Naramaneni
|

Updated on: Mar 18, 2026 | 10:19 PM

Share

వెజ్‌ లవర్స్‌కి ప్రొటీన్, కాల్షియం, ప్రోబయాటిక్స్‌ కావాలంటే బెస్ట్‌ ఛాయిస్ పన్నీర్…! గుండె, జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టాలంటే డాక్టర్స్‌ బెస్ట్ సజెషన్‌ కూడా పన్నీరే….! గేదె పాలను విరగ్గొట్టి చేసే స్వచ్ఛమైన ఆ పదార్ధాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. ఏమాత్రం కనిపెట్టలేని విధంగా నకిలీ ఫార్ములా తయారీ చేసి జేబులు నింపుకోవడమే కాదు… జనాల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్‌ మార్కెట్‌లో విచ్చలవిడిగా జరుగుతున్న పన్నీర్ అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆ తనిఖీల్లో వెలుగులోకొచ్చిన షాకింగ్ విషయాలు గుండె దడ పెంచుతున్నాయి.

పక్కా సమాచారంతో ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్‌తో కలిసి టాస్క్‌ ఫోర్స్ పోలీసులు పన్నీర్ తయారీ కేంద్రాలపై దాడులు చేయగా… ఈ కల్తీ బాగోతం బట్టబయలైంది. మహంకాళి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని శ్రీ బాలాజీ డెయిరీ ప్రోడక్ట్స్, విజయ్ మిల్క్‌ సహా 6 షాపుల్లో తనిఖీలు చేసి… మూడు వేల కిలోలకు పైగా కల్తీ పన్నీర్‌ని గుర్తించారు.

శ్రీ బాలాజీ డెయిరీలో 1600 కిలోలు… విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్‌లో 1000 కేజీలు… మిగతా ఆరు షాపుల్లో నాలుగు వందలకు పైగా కల్తీ పన్నీర్‌ని గుర్తించి సీజ్ చేశారు. కాస్త కూడా కనికరం లేకుండా కేవలం గల్లా పెట్టె నింపుకోవాలన్న అత్యాశతో ఇలాంటి దారుణానికి ఒడిగడతారా అంటూ కల్తీ కేటుగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు… ఈ తయారీ కేంద్రాల నుంచి ప్రతిరోజూ వందలాది షాపులకు పన్నీర్‌ వెళ్తోందన్నారు.

మొత్తంగా… పన్నీర్ కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. ఇలా అక్రమ తయారీ కేంద్రాల గురించి సమాచారముంటే వెంటనే తమను సంప్రదించాలని కోరారు.

Follow Us
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..
పాము కరిస్తే ఈ తప్పులు అస్సలు చేయకండి..
పాము కరిస్తే ఈ తప్పులు అస్సలు చేయకండి..
వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయా? నిపుణుల క్లారిటీ
వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయా? నిపుణుల క్లారిటీ
గుండెలు ఆగేలా ఆ విమానంలో అన్నీ సమస్యలే! భయంతో వణికిన ప్రయాణికులు
గుండెలు ఆగేలా ఆ విమానంలో అన్నీ సమస్యలే! భయంతో వణికిన ప్రయాణికులు
131 బంతుల తర్వాత తప్పు సరిదిద్దుకున్న జడేజా
131 బంతుల తర్వాత తప్పు సరిదిద్దుకున్న జడేజా
కళ్ల రంగు బట్టి మీ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? సముద్రిక శాస్త్రం
కళ్ల రంగు బట్టి మీ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? సముద్రిక శాస్త్రం
రోడ్డు మీద కూరగాయలు అమ్ముతూ కనిపించిన నటుడు..
రోడ్డు మీద కూరగాయలు అమ్ముతూ కనిపించిన నటుడు..
గత వేలంలో ఛీ కొట్టారు.. 601 పరుగులతో ఐపీఎల్ ప్రాంచైజీలకు షాక్
గత వేలంలో ఛీ కొట్టారు.. 601 పరుగులతో ఐపీఎల్ ప్రాంచైజీలకు షాక్