దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..
బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్ పవన్ తండ్రి క్యాన్సర్‌తో కన్నుమూశారు. తండ్రి మృతితో తీవ్ర విషాదంలో మునిగిన పవన్, ఆయన అస్థికలను కాశీలో నిమజ్జనం చేయడానికి తొలిసారి విమానంలో వెళ్లాడు. ఈ ఎమోషనల్ జర్నీ వీడియో వైరల్ అయింది. బిగ్ బాస్‌లో గెలిచిన రూ.15 లక్షలు తండ్రి వైద్యానికి అని పవన్ చెప్పినా, ఆ కోరిక నెరవేరలేదు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఫ్యామిలీలో ఇటీవల తీవ్ర విషాదం నెలకొంది. అతని తండ్రి దుర్గా ప్రసాద్ క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. దీంతో డీమాన్ పవన్ తో సహా అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పవన్ స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు, నెటిజన్లు అతనికి సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.ఈ క్రమంలోనే డీమాన్ ఓ ఎమోషనల్ వీడియాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో లైఫ్ లో తొలిసారి విమానం ఎక్కుతున్నట్లు అది కూడా తన నాన్న కోసం అంటూ అందులో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘ఇది నా జీవితంలో ఫస్ట్ ఫ్లైట్.. అమ్మానాన్నతో,బెస్ట్‌ఫ్రెండ్స్‌తో లేదంటే ఏదైనా ముఖ్యమైన కారణముంటేనో విమానం ఎక్కాలనుకున్నాను. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి అనుకున్నాను. దురదృష్టవశాత్తూ మా నాన్నతో నేనెప్పటికీ విమానం ఎక్కలేను. దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో! మా నాన్న కోసం నేను తొలిసారి ఫ్లైట్ ఎక్కి కాశీ వెళ్లబోతున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకం’ అంటూ ఆ వీడియోలో పవన్ ఎమోషనల్ అయ్యాడు.ప్రస్తుతం డిమాన్ పవన్ షేర్ చేసిన ఈ ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అగ్ని పరీక్షలో సత్తా చాటాడు డీమాన్ పవన్. బిగ్‌బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. తన ఆట, మాట తీరుతో త్వరగానే బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. అయితే రీతూ చౌదరితో సన్నిహితంగా మెలగడం పవన్ కు కొంచెం నెగెటివిటీని తెచ్చిపెట్టింది. వీరి లవ్ ట్రాక్ ను కొందరు ఇష్టపడితే మరికొందరు తప్పుబట్టారు. అయితే రీతూ ఎలిమినేట్ అయ్యాక మరింత ఎనర్జిటిక్ మారిపోయాడు పవన్. బిగ్ బాస్ గేమ్స్, టాస్కుల్లోనూ ఇరగ దీసి సీజన్ సెకెండ్ రన్నరప్ గా నిలిచాడు. ముఖ్యంగా ఫినాలేలో తెలివిగా రూ. 15 లక్షల క్యాష్‌ప్రైజ్ అందుకుని బయటకు వచ్చాడు. అయితే తన తండ్రి చికిత్స కోసమే బిగ్ బాస్ షోకు వచ్చానని, అందుకే ఈ రూ.15 లక్షల ప్రైజ్ మనీని తీసుకుంటున్నట్లు పవన్ చెప్పుకొచ్చాడు. అయితే అతని ఆశ నెరవేరలేదు. క్యాన్సర్ తో బాధపడుతోన్న పవన్ తండ్రి ఇటీవలే కన్నుమూశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది
Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్ దగ్గరకు రాలేదు
Prathyusha Case: 24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి
పైరసీపై సరికొత్త గూగ్లీ.. సినీ పరిశ్రమకు కొత్త భద్రత
Jabardasth Appa Rao: జుట్టుకు రంగేసుకుంటే.. ముఖం మాడిపోయింది! అప్పారావు శాడ్ స్టోరీ
దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..
జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో
పాపం.. గోల్డ్ అనుకొని స్కెచ్ వేశారు.. చివరికి..
ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..
పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే
మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు
లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??

