మైనాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్ సంచలన వివరాలను వెల్లడించింది. నిందితులు రోహిత్ రెడ్డి, రితిష్ రెడ్డిలు నమిత్ శర్మను కాల్పులు జరపాలని రెచ్చగొట్టారని పోలీసులు తెలిపారు. "నువ్వు కాల్చు, మేం చూసుకుంటాం" అని ఉసిగొల్పడంతో నమిత్ శర్మ ఫైర్ చేసినట్లు రిపోర్ట్ పేర్కొంది. రితిష్ రెడ్డి తుపాకీని ఇవ్వగా, నమిత్ మూడు రకాల డ్రగ్స్ సేవించినట్లు విచారణలో తేలింది. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ను కూడా విచారిస్తున్నారు.