AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి

ఆధ్యాత్మిక లోకంలో ఒక శకం ముగిసింది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన ధీశాలి డాక్టర్ ఎం.వి. సౌందర రాజన్ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిలుకూరు భక్తులు, ఆధ్యాత్మిక వాదులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Hyderabad: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
Dr Mv Soundararajan
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Feb 27, 2026 | 4:04 PM

Share

చిలుకూరు పేరు వింటేనే ఒక నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవం గుర్తుకొస్తుంది. ఆ విప్లవానికి ఊపిరి పోసిన వ్యక్తి సౌందర రాజన్. 90 ఏళ్ల వయస్సులోనూ ఆలయ ధర్మం కోసం, సనాతన సంప్రదాయాల రక్షణ కోసం ఆయన చూపిన పట్టుదల సాటిలేనిది. కేవలం పూజారిగానే కాకుండా వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే గొంతుకగా ఆయన గుర్తింపు పొందారు.

దేవుడు వ్యాపార వస్తువు కాదు: హుండీ లేని పాలన

దేవుడు వ్యాపార వస్తువు కాకూడదు అనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే ఆయన సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 1998లో ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని ఎదిరించి చిలుకూరు గుడిలో హుండీని తొలగించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. కేవలం వాక్ (VAK) పత్రిక ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆలయ నిర్వహణ సాధ్యమని నిరూపించారు. భక్తుల జేబులో చెయ్యి పెట్టని దేవుడు అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.

సౌందర రాజన్ కేవలం ఆధ్యాత్మిక వేత్త మాత్రమే కాదు, గొప్ప విద్యావేత్త కూడా. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా సేవలు అందించిన ఆయన, తన మేధస్సును ధర్మ రక్షణకు ఆయుధంగా మలుచుకున్నారు. గుడిలో వి.ఐ.పి దర్శనాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ధనిక-పేద తేడా లేకుండా అందరినీ ఒకే వరుసలో నిలబెట్టిన ఘనత ఆయనది.

2006లో ప్రభుత్వం చిలుకూరు ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కావాలంటే తాళాలు తీసుకెళ్లి ముఖ్యమంత్రికే ఇచ్చేస్తా అంటూ ధైర్యంగా నిలబడ్డారు. టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా దేవాలయాల విముక్తి కోసం పోరాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నేర్పిన 11 ప్రదక్షిణల సంకల్పం, 108 ప్రదక్షిణల కృతజ్ఞత భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రస్తుతం ఆయన వారసుడు సి.ఎస్. రంగరాజన్ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు