AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్.. ఎక్కడుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

మనిషి చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారని మన పెద్దలు చెబుతుంటారు. కానీ ఆ స్వర్గం ఎక్కడ ఉంది? ఇప్పటివరకు ఇది కేవలం నమ్మకం మాత్రమే. కానీ హార్వర్డ్ వర్సిటీకి చెందిన మాజీ ఫిజిక్స్ లెక్చరర్ ఒక సంచలన సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. విశ్వంలోనే ఒక నిర్ణీత దూరంలో స్వర్గం ఉందని, దానికి ఒక భౌతిక అడ్రస్ కూడా ఉందని ఆయన వాదిస్తున్నారు.

స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్.. ఎక్కడుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..
Where Is Heaven Located
Krishna S
|

Updated on: Feb 27, 2026 | 3:23 PM

Share

స్వర్గం అంటే కేవలం పురాణాల్లోని ఊహా ప్రపంచమేనా? లేక విశ్వంలో మనకు తెలియని ఒక భౌతిక ప్రదేశమా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు మాజీ హార్వర్డ్ ఫిజిక్స్ లెక్చరర్, ప్రముఖ సైన్స్ కమ్యూనికేటర్ మైఖేల్ గిల్లెన్. మనం స్వర్గం అని పిలిచే ఆ పవిత్ర ప్రదేశం ఈ విశ్వంలోనే ఒక నిర్ణీత దూరంలో ఉండవచ్చని ఆయన తాజాగా ప్రచురించిన ఒక పరిశోధనాత్మక వ్యాసంలో తెలిపారు. మైఖేల్ గిల్లెన్ సిద్ధాంతం ప్రకారం.. స్వర్గం అనేది కాస్మిక్ హోరిజోన్‌కు అవతలి వైపున ఉంది.

అసలు ఈ కాస్మిక్ హోరిజోన్ అంటే ఏమిటి?

ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ సిద్ధాంతం ప్రకారం.. గెలాక్సీలు ఒకదానికొకటి కాంతి వేగంతో దూరంగా జరుగుతున్నాయి. భూమి నుండి సుమారు 439 బిలియన్ ట్రిలియన్ కిలోమీటర్ల దూరంలో ఒక సరిహద్దు ఉంది. దీనినే కాస్మిక్ హోరిజోన్ అంటారు. దీనిని దాటి మనం ఎప్పటికీ చూడలేము, అక్కడికి చేరుకోలేము. కాంతి కూడా అక్కడి నుండి మనల్ని చేరుకోవడానికి సమయం సరిపోదు. అందుకే ఆ అవతల ఏముందో మనకు తెలియదు. అక్కడే స్వర్గం ఉండే అవకాశం ఉందని గిల్లెన్ వాదిస్తున్నారు.

గిల్లెన్ ప్రస్తావించిన 4 ప్రధాన కారణాలు

అపరిమిత విశ్వం: మనం చూడగలిగే విశ్వం కంటే అవతల ఇంకా చాలా ఉంది. మనం చూడలేనంత మాత్రాన అక్కడ ఏమీ లేదని అర్థం కాదు.

కాలం ఆగిపోయే చోటు: ఐన్‌స్టీన్ సాపేక్షత సిద్ధాంతం ప్రకారం.. కాస్మిక్ హోరిజోన్ వద్ద కాలం ఆగిపోతుంది. అక్కడ గతం, వర్తమానం, భవిష్యత్తు ఉండవు. స్వర్గం కూడా కాలాతీతమైనది కాబట్టి ఇది సరిపోలుతుందని ఆయన భావన.

బిగ్ బ్యాంగ్ కంటే ముందే: కాస్మిక్ హోరిజోన్ వద్ద విశ్వంలోని అత్యంత పురాతన వస్తువులు ఉన్నాయి. అంటే దీనికి అవతల ఉన్నది బిగ్ బ్యాంగ్ కంటే ముందే ఉండి ఉండవచ్చు.

సృష్టి రహస్యం: బిగ్ బ్యాంగ్‌ను కేవలం ఒక పేలుడుగా కాకుండా ఒక సృష్టి కథగా చూసే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు.

విమర్శలు: సైన్సా లేక మెటాఫిజిక్సా?

అయితే గిల్లెన్ సిద్ధాంతాన్ని ఇతర శాస్త్రవేత్తలు తోసిపుచ్చుతున్నారు. కనెక్టికట్ కళాశాల ప్రొఫెసర్ అలెక్స్ జియానినాస్ ప్రకారం.. కాస్మిక్ హోరిజోన్ అనేది ఒక భౌతిక ప్రదేశం కాదు.. అది కేవలం మన దృష్టికి ఉన్న ఒక పరిమితి మాత్రమే. ఇది విజ్ఞాన శాస్త్రం కంటే మెటా ఫిజిక్స్ కిందకు వస్తుందని మెజారిటీ సైంటిస్టుల అభిప్రాయం. కాగా స్వర్గం అనేది విశ్వంలో ఒక మూలన ఉందా లేక మన నమ్మకాల్లో ఉందా అనేది పక్కన పెడితే.. ఆధునిక భౌతిక శాస్త్రం, ఆధ్యాత్మికత మధ్య జరుగుతున్న ఈ చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Follow Us
ఇంటి పనితో ఇబ్బందా.. నో వర్రీ.. ఇలా చేస్తే చిటికెలో టేస్టీ చట్నీ.
ఇంటి పనితో ఇబ్బందా.. నో వర్రీ.. ఇలా చేస్తే చిటికెలో టేస్టీ చట్నీ.
భగత్ సింగ్ జ్ఞాపకాలు సజీవంగా ఉన్న చోట్లివే!
భగత్ సింగ్ జ్ఞాపకాలు సజీవంగా ఉన్న చోట్లివే!
అదిరిపోయే ఫీచర్లతో ఎంజీ హెక్టార్‌‌ హాక్ వచ్చేస్తోంది
అదిరిపోయే ఫీచర్లతో ఎంజీ హెక్టార్‌‌ హాక్ వచ్చేస్తోంది
బ్యాంకు మీ పర్సనల్‌ లోన్‌ తిరస్కరించిందా? ఇలా చేస్తే వెంటనే ఆమోదం
బ్యాంకు మీ పర్సనల్‌ లోన్‌ తిరస్కరించిందా? ఇలా చేస్తే వెంటనే ఆమోదం
ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదా.. బొప్పాయి ఆకుల రసం వెనకున్న అసలు..
ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదా.. బొప్పాయి ఆకుల రసం వెనకున్న అసలు..
ఎవ్వరిమీద లవ్వు లేదు... అసలు అబ్బాయిలే వద్దు..
ఎవ్వరిమీద లవ్వు లేదు... అసలు అబ్బాయిలే వద్దు..
ఆవు దూడకు ‘అమ్మ’గా మారిన శునకం..!
ఆవు దూడకు ‘అమ్మ’గా మారిన శునకం..!
రోజూ నిమ్మనీళ్లు తాగుతున్నారా?.. ఈ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!
రోజూ నిమ్మనీళ్లు తాగుతున్నారా?.. ఈ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!
ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఆశ చాక్లెట్ ఇప్పుడు ఎందుకు కనుమరుగైంది?
ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఆశ చాక్లెట్ ఇప్పుడు ఎందుకు కనుమరుగైంది?
తండ్రి వీలునామా రాయకపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా?
తండ్రి వీలునామా రాయకపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా?