AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: భారత్-పాక్ నో-హ్యాండ్‌షేక్‌పై ఎంసీసీ సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే?

India Pakistan No Handshake: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నెలకొన్న నో-హ్యాండ్‌షేక్ వివాదంపై క్రికెట్ చట్టాల రూపకర్త ఎంసీసీ స్పందించింది. ఆసియా కప్ 2025 నుంచి కొనసాగుతున్న ఈ ఆచారంపై ఎంసీసీ చట్టాల మేనేజర్ ఫ్రేజర్ స్టీవర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చట్టవిరుద్ధం కాదని తేల్చిచెప్పారు, మైదానంలో గౌరవం ముఖ్యమని అన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి చూడండి.

IND vs PAK: భారత్-పాక్ నో-హ్యాండ్‌షేక్‌పై ఎంసీసీ సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే?
India Pakistan No Handshake
Venkata Chari
|

Updated on: Nov 23, 2026 | 10:11 AM

Share

India Pakistan No Handshake: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య కొనసాగుతున్న నో-హ్యాండ్‌షేక్ వ్యవహారంపై క్రికెట్ చట్టాలను రూపొందించే మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తొలిసారి స్పందించింది. ఇది చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేసింది. 2025 మేలో భారత్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో ఆసియా కప్ 2025 నుంచి భారత జట్టు పాక్‌తో హ్యాండ్‌షేక్‌ను నిలిపివేసింది. అప్పటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రారంభించిన ఈ ఆచారాన్ని ఆ తర్వాత అన్ని భారత జట్లు, కెప్టెన్లు కొనసాగిస్తున్నారు.

తాజాగా రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో గ్రూప్-ఏ మ్యాచ్‌లో తిలక్ వర్మ, అబ్దుల్ సమద్ టాస్ వద్ద, మ్యాచ్ తర్వాత హ్యాండ్‌షేక్ చేసుకోలేదు. గత 18 నెలలుగా ఇరు జట్లు తలపడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి నెలకొంది.

దీనిపై ఎంసీసీ లాస్ మేనేజర్, హెడ్ ఆఫ్ క్రికెట్ ఫ్రేజర్ స్టీవర్ట్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

“పై స్థాయి నుంచి హ్యాండ్‌షేక్‌లపై ఆదేశాలు వస్తే అది ఎంసీసీ నియంత్రణలో ఉండదు. జెంటిల్‌మెన్ గేమ్ స్ఫూర్తితో హ్యాండ్‌షేక్ జరగాలని మేము కోరుకుంటాం. కానీ ఇక్కడ క్రీడకు అతీతమైన పెద్ద అంశాలు ఉన్నాయని మాకు తెలుసు, అది మా నియంత్రణకు మించినది” అని స్టీవర్ట్ అన్నారు.

“మైదానంలో ఏం జరుగుతుందో మాత్రమే మేము నియంత్రించగలం. ఆటగాళ్లు ఒకరినొకరు గౌరవించుకోవాలి, అంపైర్లను, వారి అధికారాన్ని గౌరవించాలి, ఆటను గౌరవించాలి. అదే మేము నియంత్రించగలం” అని ఆయన జోడించారు.

నిజానికి స్కూల్, క్లబ్ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు టాస్ వద్ద కెప్టెన్లు, మ్యాచ్ తర్వాత జట్లు హ్యాండ్‌షేక్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే, ఎంసీసీ, ఐసీసీ చట్టాల ప్రకారం తప్పనిసరి నిబంధన కాదు.

దీని వల్ల స్పిరిట్ ఆఫ్ క్రికెట్ దెబ్బతింటుందా అనే చర్చ జరుగుతున్నా, హ్యాండ్‌షేక్ చేయకపోవడం చట్టవిరుద్ధం కాదని ఎంసీసీ తేల్చడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.

Follow Us