Venkata Chari
Senior Sub Editor, Cricket, Sports, Trending, Business - TV9 Telugu
venkata.chari@tv9.comనా పేరు తౌడోజు వెంకటాచారి. టీవీ9 తెలుగులో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 5 ఏళ్లుగా టీవీ9 తెలుగు వెబ్ సైట్‌లో నా సేవలు అందిస్తున్నాను. ఇక్కడ స్పోర్ట్స్‌కి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే, బిజినెస్, ఆటో, వైరల్ కంటెంట్ అందిస్తుంటాను. 2013లో కేరీర్ ప్రారంభించాను. జర్నలిజంలో 12 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్, వీ6 వెలుగు దినపత్రికలోనూ పనిచేశాను. అంతకుముందు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందాను.
IND vs NZ సిరీస్‌కు ముందే షాక్.. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔట్.. ఎందుకంటే?
India vs New Zealand: భారత్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు గాయాల కారణంగా సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో అసలు జట్టును ప్రకటించిన కొద్ది రోజులకే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు టీమ్‌లో మార్పులు చేయాల్సి వచ్చింది.
- Venkata Chari
- Updated on: Oct 9, 2026
- 4:50 pm
IND vs WI T20I: రాంచీలో ఇక రచ్చ, రచ్చే.. భారత్‌లో తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ..!
India vs West Indies 2nd T20I: భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 నేడు రాంచీలో జరగనుంది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, విజయం దిశగా అడుగు వేయడానికి సిద్ధంగా ఉంది. పేలవ ఫామ్‌లో ఉన్న సంజు సామ్సన్ స్థానంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం లభిస్తుందో లేదోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Venkata Chari
- Updated on: Oct 9, 2026
- 4:35 pm
IND vs WI: అభిషేక్ శర్మ @ 53.. స్కై ఆల్ టైం రికార్డ్ బద్దలే.. అదేంటంటే?
India vs West Indies: వెస్టిండీస్‌తో రెండో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు మరో అరుదైన రికార్డు అందుబాటులోకి వచ్చింది. కేవలం 53 పరుగులు చేస్తే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 2000 పరుగులు పూర్తి చేయడంతో పాటు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న ప్రత్యేక ప్రపంచ రికార్డును కూడా అధిగమించే అవకాశం అతడికి ఉంది.
- Venkata Chari
- Updated on: Oct 9, 2026
- 4:03 pm
క్యాన్సర్‌ను జయించి 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. 33 బంతుల్లో డకౌట్‌గా పెవిలియన్‌కు..!
Australia vs South Afric: క్యాన్సర్‌తో పోరాడి మళ్లీ క్రికెట్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా బ్యాటర్ నిక్ మాడిన్సన్‌కు పునరాగమనం అనుకున్నంతగా సాగలేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 33 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు.
- Venkata Chari
- Updated on: Oct 9, 2026
- 3:36 pm
ధోనీ, కోహ్లీ, రోహిత్ బాటలోనా.. హార్దిక్ పాండ్యా చెత్త రికార్డులోనా.. రాంచీలో శ్రేయస్ అయ్యర్ దారి ఎటు..?
India vs West Indies 2nd T20I: రాంచీ అంటేనే టీమిండియాకు కలిసొచ్చే మైదానం. ఈ వేదికపై ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ విజయాలు అందుకుంది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో వెస్టిండీస్‌తో రెండో టీ20కి సిద్ధమైంది. లక్నోలో తొలి మ్యాచ్ గెలిచిన భారత్.. రాంచీలోనూ అదే జోరు కొనసాగిస్తే సిరీస్‌పై పట్టు మరింత బిగించనుంది.
- Venkata Chari
- Updated on: Oct 9, 2026
- 1:53 pm
బిగ్ షాక్.. రిహాబ్‌కు ఏకంగా 32 మంది భారత ఆటగాళ్లు.. సీఓఈ నివేదికలో సంచలన విషయాలు..!
Team India Injury Crisis: టీమిండియా ఎంత బలమైన జట్టైనా.. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే వ్యూహాలన్నీ తలకిందులే! ఇప్పుడు భారత క్రికెట్‌లో అదే సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ఏడాది వ్యవధిలో ఏకంగా 32 మంది టాప్ క్రికెటర్లు గాయాల నుంచి కోలుకునేందుకు రిహాబిలిటేషన్ చేయించుకున్నట్టు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నివేదిక వెల్లడించింది.
- Venkata Chari
- Updated on: Oct 9, 2026
- 1:30 pm
బేస్ ప్రైస్ రూ.11.5 లక్షలతో ఎంట్రీ.. ఫ్రాంచైజీల పోటీతో కోట్ల వర్షం.. అసలెవరీ 18 ఏళ్ల యంగ్ సెన్సేషన్..?
Jason Rawls SA20: క్రికెట్ ప్రపంచంలో ఒక్క ఆక్షన్ బిడ్ ఓ యువ ఆటగాడి జీవితాన్నే మార్చేయొచ్చు. SA20 సీజన్-5 ఆక్షన్‌లో అదే జరిగింది. కేవలం 18 ఏళ్ల వయసున్న దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కోసం ఫ్రాంచైజీలు భారీగా పోటీ పడ్డాయి. రూ.11.5 లక్షల బేస్ ప్రైస్‌తో మొదలైన అతడి ప్రయాణం ఏకంగా రూ.1.68 కోట్ల దగ్గర ఆగింది. ఇంతకీ ఈ యువ సంచలనం ఎవరు?
- Venkata Chari
- Updated on: Oct 9, 2026
- 1:02 pm
భారత్‌పై గ్రాండ్‌గా డెబ్యూ.. కట్‌చేస్తే.. 12 ఏళ్ల బ్యాన్.. ఈ క్రికెటర్ కథ తెలిస్తే కన్నీళ్లే..!
India Test Debut: అసాధారణ ప్రతిభతో స్కూల్ క్రికెట్‌లో రికార్డులు సృష్టించిన ఓ దిగ్గజ ప్లేయర్.. హాకీలోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించి, టెస్టు అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో వేల పరుగులు చేసిన అతడి కెరీర్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఊహించని మలుపు తిరిగింది. 2016లో దోషిగా తేలడంతో 12 ఏళ్ల నిషేధం ఎదుర్కొని, గొప్ప ప్రయాణాన్ని విషాదంగా ముగించాడు.
- Venkata Chari
- Updated on: Oct 9, 2026
- 12:11 pm
ఆస్ట్రేలియాను భయపెడుతోన్న శాండ్ పేపర్ వివాదం.. ఖవాజా పుస్తకంతో మళ్లీ తెరపైకి..!
Sabr Autobiography: 2018లో ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన శాండ్ పేపర్ గేట్ (Sandpapergate) వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి మ్యాచ్‌లో జరిగిన ఘటనతో కాదు.. మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా రాస్తున్న ఆత్మకథతో! త్వరలో విడుదల కానున్న ‘Sabr’ పుస్తకంలో ఆ వివాదానికి సంబంధించిన కీలక విషయాలు బయటకు వస్తాయన్న చర్చ మొదలైంది. దీనిపై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించాడు.
- Venkata Chari
- Updated on: Oct 9, 2026
- 11:33 am
ఓరేయ్ బుడ్డోడా.. అతనిలా అస్సలు మారకురోయ్.. వైభవ్‌ను హెచ్చరించిన కపిల్ దేవ్..!
Vaibhav Suryavanshi: పదిహేనేళ్లకే టీమిండియాలో చోటు.. అంతకుముందే ఐపీఎల్‌లో సంచలన రికార్డు.. అండర్-19 క్రికెట్‌లో విధ్వంసక బ్యాటింగ్..! ఇలా వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు భారత క్రికెట్‌లో మార్మోగుతోంది. అయితే ఈ యువ సంచలనంపై దిగ్గజం కపిల్ దేవ్ మాత్రం ప్రశంసలతో పాటు ఓ కీలక హెచ్చరిక చేశారు. వైభవ్ భవిష్యత్తును ఇప్పుడే నిర్ణయించొద్దని స్పష్టం చేశారు.
- Venkata Chari
- Updated on: Oct 9, 2026
- 10:17 am
ఇక లాభం లేదురా బుడ్డోడా.. టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ టీమిండియాలో తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు వికెట్ కీపింగ్ సాధన చేస్తున్నాడు. అంతర్జాతీయ పోటీ పెరిగిన నేపథ్యంలో ఆల్-రౌండర్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రంజీ ట్రోఫీకి ముందు ముంబై తరఫున గ్లౌవ్స్ ధరించి వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. బ్యాటింగ్‌తో పాటు ఈ కొత్త నైపుణ్యం జైస్వాల్‌ను టీమిండియాకు మరింత విలువైన ఆటగాడిగా మార్చగలదని అంచనా.
- Venkata Chari
- Updated on: Oct 9, 2026
- 7:35 am
నెట్స్‌లో బుడ్డోడి ఊచకోత.. తుది జట్టులోకి చోటు కోసం గట్టిగానే ఇచ్చిపడేశాడుగా..?
ind vs wi 2nd t20i: నెట్స్‌లో వైభవ్ సూర్యవంశీ చూపించిన విధ్వంసం చూశాక మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సంజూ శాంసన్‌కు మరో ఛాన్స్ ఇస్తారా లేక ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను నేరుగా బరిలోకి దించుతారా అన్నది మ్యాచ్ సమయానికి తేలనుంది.
- Venkata Chari
- Updated on: Oct 9, 2026
- 7:00 am