Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్..? ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ ఏమన్నాడంటే..?
Suryakumar Yadav Retirement Announcement: టీమిండియా టీ20 కెప్టెన్ టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటించకపోవడం అభిమానులకు పెద్ద ఊరటనిచ్చే విషయం. ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న సూర్య, రాబోయే ఒలింపిక్స్, 2028 ప్రపంచకప్‌లో కూడా భారత్‌ను ముందుండి నడిపిస్తాడని ఆశిద్దాం.

Suryakumar Yadav Retirement Announcement: భారత క్రికెట్ చరిత్రలో ఐసీసీ ట్రోఫీని అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించారు. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ గెలిచిన తర్వాత, అందరి దృష్టి సూర్య రిటైర్మెంట్‌పై పడింది. 35 ఏళ్ల వయసు కావడంతో, ఆయన ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్య ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు.
రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన సూర్యకుమార్ యాదవ్, రిటైర్మెంట్ ప్రశ్నపై తనదైన శైలిలో స్పందించాడు. “ప్రస్తుతం అంతా చాలా బాగున్నప్పుడు, అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది?” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. దీని ద్వారా తాను ఇప్పుడప్పుడే క్రికెట్‌కు స్వస్తి పలికే ఉద్దేశం లేదని ఆయన తేల్చి చెప్పాడు.
ముందున్న లక్ష్యాలు ఇవే:
తన తదుపరి ప్రణాళికల గురించి చెబుతూ, సూర్య మరో రెండు ప్రధాన లక్ష్యాలను వెల్లడించాడు. అవేంటో ఓసారి చూద్దాం..
ఒలింపిక్స్ గోల్డ్ మెడల్: క్రికెట్ ఒలింపిక్స్‌లో చేరిన నేపథ్యంలో భారత్‌కు స్వర్ణం అందించాలని ఆయన ఆకాంక్షించా డు.
2028 టీ20 ప్రపంచకప్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరిగే 2028 ప్రపంచకప్‌లో కూడా ఆడాలని సూర్య లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీని ప్రకారం, ఆయన కనీసం మరో రెండేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.
టోర్నీలో సూర్య ప్రదర్శన:
ఫైనల్ మ్యాచ్‌లో సూర్య డకౌట్ అయినప్పటికీ, టోర్నీ అంతటా నిలకడగా రాణించాడు.
మొత్తం పరుగులు: 9 మ్యాచ్‌ల్లో 242 పరుగులు.
స్థానం: ఈ ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్.
ముఖ్యమైన ఇన్నింగ్స్: టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఒత్తిడిలో హాఫ్ సెంచరీ బాది జట్టుకు విజయాన్ని అందించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
