September 27 2026
venkata chari
వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లీ 139 పరుగులతో అజేయ శతకం సాధించాడు. దీంతో తన పేరుతో ఎన్నో రికార్డులు లిఖించుకున్నాడు.
తిరువనంతపురం వన్డేలో కోహ్లీ 88 బంతుల్లో 139 పరుగులతో విన్నింగ్ నాక్ ఆడేశాడు. దీంతో భారత్ తొలి వన్డేలో ఘన విజయం సాధించింది.
తాజా సెంచరీతో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ శతకాల సంఖ్య 86కు చేరింది. ఈ క్రమంలో సచిన్ రికార్డ్‌ను చేరుకునేలా కనిపిస్తున్నాడు.
కోహ్లీ శతకం చేసిన 60 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. అలాగే ఛేజింగ్‌లోనూ రన్ మెషీన్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
శతకం చేసిన మ్యాచ్‌ల్లో జట్టుకు 60 విజయాలు అందించిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ నిలిచాడు. మరే ఆటగాళ్లు ఈ లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం.
ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ రికీ పాంటింగ్ 71 శతకాలు సాధించాడు. వాటిలో 55 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆస్ట్రేలియా గెలిచింది.
సచిన్ టెండూల్కర్ శతకం చేసిన 53 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. మొత్తంగా మూడవ స్థానంలో నిలిచాడు.
రోహిత్ శర్మ 51 అంతర్జాతీయ శతకాలు చేశాడు. వాటిలో 42 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది.