AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదేందిది.. మైదానంలో రోహిత్, రితికా గొడవ పడ్డారా.. ఇద్దరిమధ్య అసలేం జరిగింది..?

Rohit Sharma Ritika Sajdeh viral video: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత మైదానంలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరియు అతని భార్య రితిక సజ్దేహ్ మధ్య జరిగిన తీవ్ర చర్చ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Video: ఇదేందిది.. మైదానంలో రోహిత్, రితికా గొడవ పడ్డారా.. ఇద్దరిమధ్య అసలేం జరిగింది..?
Rohit Sharma Ritika Sajdeh Viral Video
Venkata Chari
|

Updated on: Mar 09, 2026 | 12:26 PM

Share

Rohit Sharma Ritika Sajdeh viral video: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) ఫైనల్‌లో భారత జట్టు (India national cricket team) 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టు(New Zealand national cricket team) ను ఓడించి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్ తర్వాత సంబరాల మధ్య మరో ఆసక్తికర ఘటన కెమెరాల్లో బంధించబడింది.

రోహిత్ – రితికా మధ్య హీటెక్కిన సంభాషణ..

భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన భార్య రితికా సజ్దే (Ritika Sajdeh) తో బౌండరీ దగ్గర మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీమిండియా విజయం తర్వాత మైదానంలో సంబరాలు జరుగుతున్న సమయంలో రోహిత్ రితికా వద్దకు వెళ్లి మాట్లాడాడు.

ఆ సమయంలో రోహిత్ చేతి సంకేతాలు, ముఖభావాలు చూస్తే, చాలా తీవ్రమైన చర్చ జరుగుతున్నట్లు కనిపించాయి. రితికా కూడా స్పందిస్తూ మాట్లాడడం కెమెరాల్లో కనిపించింది.

కొన్ని క్షణాల పాటు ఇద్దరి మధ్య వాదన జరిగినట్లు అనిపించడంతో ఈ వీడియో అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది.

వరల్డ్ కప్ ఫైనల్‌నకు రోహిత్ ప్రత్యేక పాత్ర..

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అధికారికంగా ఆటగాడిగా కాకుండా టోర్నమెంట్ అంబాసడర్‌గా పాల్గొన్నాడు. అతను ఎంఎస్ ధోని (MS Dhoni) తో కలిసి స్టేడియంలో ట్రోఫీని తీసుకువచ్చే గౌరవాన్ని పొందాడు.

జట్టు విజయంపై రోహిత్ స్పందన..

విజయం తర్వాత రోహిత్ శర్మ సోషల్ మీడియాలో జట్టును అభినందించాడు. ఈ ట్రోఫీ విజయం మొత్తం జట్టు కృషి ఫలితమని, ప్రతి ఆటగాడు కీలక సమయంలో తన వంతు పాత్ర పోషించాడని పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us