AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త సంచలనం..154.2 కి.మీ వేగంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రైతు బిడ్డ

IPL 2026 : గుజరాత్ టైటాన్స్ పేసర్ అశోక్ శర్మ ఐపీఎల్ 2026లో 154.2 కి.మీ వేగంతో సీజన్ ఫాస్టెస్ట్ బాల్ వేశాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ యువ స్పీడ్ స్టార్ రికార్డు సృష్టించాడు.ఇది ఈ సీజన్‌లోనే ఇప్పటివరకు నమోదైన అత్యంత వేగవంతమైన బంతి.

IPL 2026 : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త సంచలనం..154.2 కి.మీ వేగంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రైతు బిడ్డ
Ipl 2026 Ashok Sharma
Rakesh
|

Updated on: Apr 05, 2026 | 8:58 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026లో మరో భారతీయ స్పీడ్ స్టార్ పుట్టుకొచ్చాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ యువ పేసర్ అశోక్ శర్మ తన వేగంతో మైదానాన్ని హోరెత్తించాడు. కేవలం వేగమే కాదు, కచ్చితమైన యార్కర్లతో బ్యాటర్ల పని పట్టాడు. ఈ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ లో అశోక్ శర్మ ఒక అద్భుతం చేశాడు. ఆ ఓవర్ చివరి బంతిని ఏకంగా 154.2 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఇది ఈ సీజన్‌లోనే ఇప్పటివరకు నమోదైన అత్యంత వేగవంతమైన బంతి. మిడిల్, ఆఫ్ స్టంప్ గురిచూసి వేసిన ఈ పర్‌ఫెక్ట్ యార్కర్‌ను ఎదుర్కోవడం ధ్రువ్ జురెల్‌కు సాధ్యం కాలేదు. బంతి నేరుగా వచ్చి ప్యాడ్లను తాకింది. ఈ బంతి వేగాన్ని చూసి స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. ఈ మ్యాచ్‌లో అశోక్ 4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసినప్పటికీ, అతని బౌలింగ్ క్వాలిటీ, పేస్ ప్రత్యర్థి బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టాయి.

ఎవరీ అశోక్ శర్మ?

అశోక్ శర్మ రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ సమీపంలో ఉన్న రాంపూర అనే చిన్న గ్రామానికి చెందినవాడు. అతని తండ్రి నాథూ లాల్ శర్మ ఒక సాధారణ రైతు. 2002 జూన్ 17న జన్మించిన అశోక్, పాఠశాల రోజుల నుంచే క్రికెట్ మైదానంలో తన వేగంతో ప్రత్యర్థులను భయపెట్టేవాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో అతనికి ఐపీఎల్ తలుపులు తెరుచుకున్నాయి. దేశవాళీ టీ20ల్లో అతని పేస్ చూసిన గుజరాత్ మేనేజ్‌మెంట్ ఈసారి అతనికి అవకాశం ఇచ్చింది.

మూడేళ్ల నిరీక్షణ తర్వాత దక్కిన ఛాన్స్

ఐపీఎల్‌లో అశోక్ శర్మ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇతన్ని 55 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినప్పటికీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత 2025లో రాజస్థాన్ రాయల్స్ 30 లక్షలకు దక్కించుకుంది, కానీ అక్కడ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ ఇతనిపై నమ్మకం ఉంచింది. తన వేగానికి పదును పెట్టిన అశోక్, దక్కిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సర్కిల్‌లో ఇతన్ని రఫ్తార్ సింగ్ అని పిలుచుకుంటున్నారు.

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా గుర్తింపు

సాధారణంగా భారతీయ బౌలర్లు 130-135 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తారు, కానీ అశోక్ నిలకడగా 145 కి.మీ పైగా వేగాన్ని నమోదు చేస్తున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో హార్డ్ లెంగ్త్ డెలివరీలు, ఇన్-స్వింగింగ్ యార్కర్లు వేయడంలో అతను నేర్పరి అని నిరూపించుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ బ్యాటర్లకు కూడా అశోక్ పేస్ సవాలు విసరడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో భారత జట్టుకు ఇతను ఒక ఆస్తిగా మారే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us