రోహిత్, కోహ్లీ కాదు.. 2027 ప్రపంచకప్‌నకు తొలి ప్లేయర్ ఫిక్స్ చేసిన గంభీర్.. ఎవరంటే?
India squad 2027 World Cup: భారత క్రికెట్ జట్టు వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ కోసం అప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఐపీఎల్ 2026 సందడి కొనసాగుతుండగానే, జట్టులో చోటు దక్కించుకోబోయే తొలి ఆటగాడి పేరు దాదాపు ఖరారైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలను కాదని ఒక స్టార్ ఆల్ రౌండర్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపడం విశేషం.

India squad 2027 World Cup: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ బ్యాటింగ్ సత్తాతో అలరిస్తున్నారు. ముఖ్యంగా కోహ్లీ గత ఏడాది కాలంగా వన్డేల్లో అద్భుతమైన సగటుతో పరుగులు సాధిస్తుండగా, రోహిత్ తన ఫిట్‌నెస్ విషయంలో భారీ మార్పులు చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయినప్పటికీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దృష్టి మాత్రం భవిష్యత్తు అవసరాలపై ఉంది. ఈ క్రమంలోనే జట్టు సమతుల్యత కోసం ఒక కీలక ఆటగాడిని ముందుగానే ఎంపిక చేసినట్లు సమాచారం.
హార్దిక్ పాండ్యాకు బంపర్ ఆఫర్: ప్రపంచకప్ జట్టులో తొలి పేరుగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఖరారైనట్లు తెలుస్తోంది. గతంలో గాయాల వల్ల జట్టుకు దూరమైనప్పటికీ, పాండ్యాకు ఉన్న అద్భుతమైన నైపుణ్యాల దృష్ట్యా అతడిని జట్టులో చేర్చుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలోని వేగవంతమైన పిచ్‌లపై ఒక నాణ్యమైన ఆల్ రౌండర్ అవసరం ఎంతైనా ఉందని సెలెక్టర్లు భావిస్తున్నారు. అందుకే అతడిని ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉండాలని సూచించారు.
బౌలింగ్ కోటాపై స్పష్టత: బీసీసీఐ ఎంపిక కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ జనవరి నెలలోనే పాండ్యాతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా వన్డేల్లో పూర్తి స్థాయిలో పది ఓవర్ల కోటాను పూర్తి చేయగలిగితేనే అతడి ప్రాధాన్యత పెరుగుతుందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. ప్రతి మ్యాచ్‌లో పది ఓవర్లు వేయకపోయినా, కెప్టెన్‌కు అవసరమైనప్పుడు ఆ సత్తా కలిగి ఉండాలని బోర్డు కోరింది. దక్షిణాఫ్రికా పిచ్‌లు పేసర్లకు అనుకూలిస్తాయి కాబట్టి, పాండ్యా రూపంలో భారత్‌కు నాలుగో పేసర్ దొరికినట్లవుతుంది.
జట్టుకు అసలైన బలం: 94 వన్డేల్లో దాదాపు 1900 పరుగులు, 91 వికెట్లు తీసిన రికార్డు పాండ్యా సొంతం. లోయర్ ఆర్డర్‌లో మెరుపు వేగంతో పరుగులు రాబట్టడమే కాకుండా, మధ్య ఓవర్లలో కీలక వికెట్లు తీయడంలో అతను దిట్ట. 2027 ప్రపంచకప్ నాటికి అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే, భారత జట్టుకు తిరుగుండదని విశ్లేషకులు భావిస్తున్నారు. రోహిత్, కోహ్లీ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్నప్పటికీ, పాండ్యా ఇచ్చే సమతుల్యత వల్లే అతడికి మొదటి ప్రాధాన్యత దక్కింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
