ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నిశ్చితార్థం జరగాల్సిన యువకుడు ప్రసాద్, రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. కొడుకు పెళ్లి కలలు కన్న తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.