Horoscope Today: ఆర్థికంగా వారికి ఊహించని అదృష్టం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (April 05, 2026): మేష రాశి వారు ఈ రోజు శుభ వార్తలు ఎక్కువగా వినే అవకాశముంది. ఆర్థికంగా ఊహించని అదృష్టం పడుతుంది. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయట పడతారు. మిథున రాశి వారు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (ఏప్రిల్ 5, 2026): ఈ రోజు పలు రాశులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఆరోగ్యం, ఆర్థికంగా ఢోకా ఉండదు. మరికొన్ని రాశుల వారు ఆర్థికంగా ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది. మేష రాశి వారు ఈ రోజు శుభ వార్తలు ఎక్కువగా వినే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆర్థికంగా ఊహించని అదృష్టం పడుతుంది. వృత్తి, ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలకు ఏమాత్రం లోటుండకపోవచ్చు. పిల్లలు విద్య, ఉద్యోగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. షేర్లు లాభిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది. అధికారులకు నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయట పడతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆటంకాలు, అవరోధాలు ఉన్నప్పటికీ ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఇంటా బయటా పరిస్థితులు కొద్దిగా ఒత్తి డిని కలిగిస్తాయి ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం మీద వీలైనంతగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా ఒడిదుడుకులు, సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. బంధువుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. వ్యక్తి గత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్ని చక్కబెడతారు.పెండింగ్ పనుల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలు సీదా సాదాగా సాగుతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. పెట్టుబడులు పెంచడానికి ఇది సమయం కాదు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. అయితే, వృథా ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది. ఆరోగ్యం సానుకూలంగా సాగిపోతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వినే అవకాశముంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి మంచి గుర్తింపు లభించి. రాబడి పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి నిరుద్యోగులకు తప్పకుండా ఆశించిన స్పందన లభిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే సూచనలున్నాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి. ఆర్థికంగా అను కూలతలు పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఒకరిద్దరు బంధు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి సమయం అనుకూలంగా ఉంది. పిల్లలు చదువుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు, ప్రత్యేక లక్ష్యాలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా విజయాలు సాదిస్తారు. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ముఖ్యమైన పనులు చురుకుగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ముఖ్య మైన ప్రయత్నాలు, వ్యవహారాలు సఫలం అవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. శ్రమ, తిప్పట ఉన్నా కొన్ని ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలై, ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, కొత్త లక్ష్యాలు, ప్రాజెక్టులు చేపడతారు. గృహ, వాహన యోగాలు పట్టడానికి అవకాశముంది. ఆర్థిక విషయాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రులతో హ్యాపీగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.