AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈత కొడితే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఎండలు మండిపోతున్నాయి.. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం అందరూ స్విమ్మింగ్ పూల్ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఈత కొట్టడం అంటే కేవలం సరదా మాత్రమే కాదు.. అదొక అద్భుతమైన సంపూర్ణ శరీర వ్యాయామం.. జిమ్‌కు వెళ్లి గంటల తరబడి కష్టపడలేని వారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఈత ఒక దివ్యౌషధం. గుండె ఆరోగ్యం నుంచి ఊపిరితిత్తుల సామర్థ్యం వరకు ఈత వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

Krishna S
|

Updated on: Apr 04, 2026 | 8:46 PM

Share
ఎండలు ముదురుతున్న కొద్దీ అందరికీ గుర్తొచ్చే మొదటి సరదా ఈత. నీటిలో కాసేపు అలా గడిపితే మనసుకి ప్రశాంతతతో పాటు శరీరానికి అద్భుతమైన వ్యాయామం లభిస్తుంది. ఇతర వ్యాయామాలతో పోలిస్తే ఈత చాలా సులభం, పైగా వినోదాన్ని కూడా ఇస్తుంది. అయితే రెగ్యులర్‌గా ఈత కొట్టడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అదే విధంగా స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు సైతం తీసుకోవాలి..

1 / 5
సంపూర్ణ శరీర వ్యాయామం: ఈత కొట్టేటప్పుడు శరీరంలోని ప్రతి కండరం కదులుతుంది. ఇది కండరాలను బలోపేతం చేయడమే కాకుండా అనవసరమైన కొవ్వును కరిగించి శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచుతుంది. జిమ్‌కు వెళ్లి గంటల తరబడి కష్టపడలేని వారికి ఈత ఒక చక్కని ప్రత్యామ్నాయం.

2 / 5
గుండె, ఊపిరితిత్తులు: క్రమం తప్పకుండా ఈత సాధన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా, ఈత కొట్టేటప్పుడు మనం తీసుకునే క్రమబద్ధమైన శ్వాస వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది.

3 / 5
మానసిక ప్రశాంతత - మంచి నిద్ర: రోజంతా పని ఒత్తిడితో అలసిపోయిన వారికి ఈత ఒక మంచి స్ట్రెస్ బస్టర్. నీటిలో గడపడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. దీనివల్ల రాత్రిపూట గాఢ నిద్ర పడుతుంది, ఉదయాన్నే ఉల్లాసంగా అనిపిస్తుంది.

4 / 5
చాలా స్విమ్మింగ్ పూల్స్‌లో నీటిని శుద్ధి చేయడానికి క్లోరిన్ ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని నల్లగా మార్చడమే కాకుండా జుట్టు రాలడం, కంటి మంట వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఈతకు వెళ్లేవారు వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్, వాటర్ గాగుల్స్, షవర్ క్యాప్ వంటివి వాడాలి. కీళ్ల నొప్పులు ఉన్నవారు లేదా తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు సొంతంగా ఈత మొదలుపెట్టకూడదు. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించి, వారి సలహా మేరకే ఈత కొట్టడం మంచిది.

5 / 5
Follow Us