అధిక రక్తపోటు ఉన్న వారు ఏయే ఆహారాలు తీసుకోవాలి? బీపీ అదుపులో..

04 April, 2026

Subhash

పాలకూర వంటి ఆకుకూరల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపి, రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఆకుకూరలు

బీపీని నియంత్రించడంలో అరటిపండు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును సహజంగా తగ్గించడానికి సహాయపడుతుంది.

 అరటిపండు 

బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ సాఫీగా జరిగి బీపీ తగ్గుతుంది. ప్రతిరోజూ గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగడం చాలా మంచిది.

బీట్‌రూట్

తక్కువ కొవ్వు ఉన్న పెరుగులో కాల్షియం, అలాగే ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

పెరుగు

ఓట్స్‌లో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. ఉదయం టిఫిన్‌గా ఓట్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది.

ఓట్స్

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. అలాగే  రక్తపోటును తగ్గిస్తుంది.

వెల్లుల్లి 

బాదం, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు, అలాగే అవిసె గింజలలో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

నట్స్, విత్తనాలు

బీపీ ఉన్న వారు ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ ఆహారంలో ఉప్పు (సోడియం) వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.

ఉప్పు తగ్గించండి:

శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఆహారంతో పాటు రోజూ కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం తప్పనిసరి.

నీరు ఎక్కువగా తాగాలి