AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో ఈ దిశలో పొరపాటున కూడా చెత్త వేయకండి.. దరిద్రం దశావతారం ఆడుతుంది..

మీరు ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు వీడటం లేదా? ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారా? అయితే మీ ఇంటి మూలల్లో దాగి ఉన్న ఆ చెత్తపై ఒక కన్నేయండి.. మనం భవిష్యత్తులో పనికొస్తాయని దాచుకునే పాత వస్తువులే మన దరిద్రానికి కారణం కావచ్చని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. అసలు ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ప్రమాదమో తెలుసుకుందాం..

ఇంట్లో ఈ దిశలో పొరపాటున కూడా చెత్త వేయకండి.. దరిద్రం దశావతారం ఆడుతుంది..
Vastu Tips For Household Waste
Krishna S
|

Updated on: Apr 04, 2026 | 8:19 PM

Share

మనం సాధారణంగా పాత వస్తువులను, విరిగిన సామాన్లను భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయి కదా అని దాచిపెడుతుంటాం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద పొరపాటు. ఇంట్లో పేరుకుపోయిన పనికిరాని వస్తువులు కేవలం స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి. దీనివల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

పురోగతికి అడ్డుకట్ట

వాస్తు ప్రకారం.. ఇంట్లో చిందరవందరగా ఉన్న సామాన్లు సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీనివల్ల మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు రావడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, మానసిక ఒత్తిడి పెరగడం వంటివి జరుగుతాయి. మీ జీవితంలో ముందుకు సాగలేకపోతున్నామనే భావన కలగడానికి ఈ పాత వస్తువులే ప్రధాన కారణం కావచ్చు.

ఆర్థిక కష్టాలు – లక్ష్మీదేవి ఆగ్రహం

పరిశుభ్రంగా, క్రమపద్ధతిలో ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. అనవసరమైన వస్తువులతో నిండిన ఇంట్లో ప్రతికూలత పెరిగి, సంపాదన నిలవదు. అనవసరపు ఖర్చులు పెరగడం, అప్పుల పాలు కావడం వంటి ఆర్థిక ఇబ్బందులకు ఈ చెత్తాచెదారం దారితీస్తుంది.

అనారోగ్య సమస్యలు

పాత ఫర్నిచర్, విరిగిన వస్తువులపై దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా త్వరగా పేరుకుపోతాయి. వాస్తు ప్రకారం.. ఇల్లు ఎంత విశాలంగా, గాలి వెలుతురుతో ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. పాత సామాన్ల వల్ల ఇంట్లో గాలి కలుషితమై, కుటుంబ సభ్యులు తరచూ రోగాల బారిన పడే అవకాశం ఉంది.

దెబ్బతినే సంబంధ బాంధవ్యాలు

ఇంట్లో వాతావరణం అస్తవ్యస్తంగా ఉంటే అది మన మనస్తత్వంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల చిన్న విషయాలకే చిరాకు కలగడం, కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన వివాదాలు, మనస్పర్థలు రావడం వంటివి జరుగుతాయి. ప్రశాంతమైన వాతావరణం లేని చోట బంధాలు బలహీనపడతాయి.

ఈశాన్య మూల – అత్యంత ప్రమాదకరం

వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశను దైవ మూలగా పరిగణిస్తారు. ఈ మూలలో పొరపాటున కూడా పాత బూట్లు, బరువైన వస్తువులు, విరిగిన సామాన్లు లేదా చెత్తాచెదారాన్ని ఉంచకూడదు. ఇక్కడ మురికి ఉంటే ఇంట్లోకి తీవ్రమైన ప్రతికూలత ప్రవేశిస్తుంది. ఇది సంతాన సమస్యలకు, తీవ్రమైన ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ఈ మూలను ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచుకోవాలి.

Follow Us