AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సీక్రెట్ యాప్‌లో 40 లక్షల మంది.. టాప్‌లో హైదరాబాద్.. ఈ రిపోర్ట్ చూస్తే నోరెళ్లబెడతారు..

డిజిటల్ విప్లవం మనుషుల మధ్య దూరాలను తగ్గించడమే కాదు.. సంబంధాల నిర్వచనాలనే మార్చేస్తోంది. ముఖ్యంగా వివాహ బంధంలో ఉండి కూడా కొత్త పరిచయాలను, ఉత్తేజాన్ని కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లోకు భారత్‌లో ఆదరణ పెరుగుతోంది. కేవలం పురుషులే కాదు, మహిళల భాగస్వామ్యం కూడా ఇందులో భారీగా పెరగడం విశేషం.

ఆ సీక్రెట్ యాప్‌లో 40 లక్షల మంది.. టాప్‌లో హైదరాబాద్.. ఈ రిపోర్ట్ చూస్తే నోరెళ్లబెడతారు..
Extra Marital Dating Trends
Krishna S
|

Updated on: Apr 04, 2026 | 7:25 PM

Share

ఒకప్పుడు వివాహం అంటే జీవితకాల బంధం అనే బలమైన నమ్మకం ఉండేది. కానీ డిజిటల్ యుగంలో ఆ ధోరణి వేగంగా మారుతోంది. భారతదేశంలో వివాహేతర సంబంధాల కోసం వెతికే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ విభాగంలో ప్రపంచంలోనే మొట్టమొదటి డేటింగ్ ప్లాట్‌ఫామ్ అయిన గ్లీడెన్ ఇప్పుడు భారత్‌లో 4 మిలియన్ల సభ్యుల మైలురాయిని చేరుకోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిశబ్ద డిజిటల్ టాన్స్‌ఫర్మేషన్ సామాజిక నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

హైదరాబాద్, బెంగళూరు టాప్

ఈ ప్లాట్‌ఫామ్ వినియోగదారుల పరంగా చూస్తే దక్షిణాది నగరాలు ముందంజలో ఉన్నాయి. బెంగళూరు 18శాతం వాటాతో దేశంలోనే అతిపెద్ద కేంద్రంగా నిలిచింది. హైదరాబాద్ 17శాతం వినియోగదారులతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ 11శాతం, ముంబై 9శాతం, పుణె 7శాతం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కేవలం మెట్రో నగరాలే కాకుండా లక్నో, చండీగఢ్, సూరత్, పాట్నా వంటి టైర్-2 నగరాల్లో కూడా ఈ ధోరణి వేగంగా వ్యాపిస్తోంది.

మహిళల భాగస్వామ్యంలో భారీ పెరుగుదల

ఈ యాప్ నివేదిక ప్రకారం.. వినియోగదారులలో 65శాతం మంది పురుషులు కాగా, 35శాతం మంది మహిళలు ఉన్నారు. అయితే గత రెండేళ్లలో మహిళల భాగస్వామ్యం ఏకంగా 148శాతం పెరగడం అత్యంత ముఖ్యమైన మార్పుగా గ్లీడెన్ ఇండియా కంట్రీ మేనేజర్ సైబిల్ షిడెల్ తెలిపారు. ఇది సమాజంలో వస్తున్న పెద్ద సాంస్కృతిక మార్పుకు సంకేతమని ఆమె అభివర్ణించారు.

చాటింగ్ సమయాలు – ఆసక్తికర అంశాలు

భారతీయులు ఈ యాప్‌ను ఎలా వాడుతున్నారన్నదానిపై కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..

సగటు సమయం: సభ్యులు రోజుకు సగటున గంట నుండి గంటన్నర పాటు ఇందులో గడుపుతున్నారు.

పీక్ అవర్స్: మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య మరియు రాత్రి 10 నుండి అర్ధరాత్రి మధ్య ఈ యాప్‌లో యాక్టివిటీ ఎక్కువగా ఉంటోంది.

వయస్సు ప్రాధాన్యతలు: పురుషులు ఎక్కువగా 25-30 ఏళ్ల మహిళల కోసం వెతుకుతుండగా మహిళలు మాత్రం 30-40 ఏళ్ల మధ్య వయస్సున్న పురుషులను ఇష్టపడుతున్నారు.

పెరుగుతున్న ఈ గణాంకాలు భారతీయ కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులను ప్రతిబింబిస్తున్నాయి. ఆన్‌లైన్ డేటింగ్ కేవలం అవివాహితులకే కాకుండా వివాహ బంధంలో ఉండి కొత్త సంబంధాలను కోరుకునే వారికి కూడా ఒక వేదికగా మారుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛా? లేక నైతిక విలువల పతనమా? అనే చర్చ పక్కన పెడితే, డిజిటల్ ప్రపంచంలో ఈ ధోరణి మాత్రం అప్రతిహతంగా కొనసాగుతోంది.

Follow Us
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో
యూపీఐ వాడేవారికి గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి..
యూపీఐ వాడేవారికి గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి..
జూన్‌లో గ్రహాల సంచారం.. 5 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు, వివాహ యోగం
జూన్‌లో గ్రహాల సంచారం.. 5 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు, వివాహ యోగం
కొండచిలువ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
కొండచిలువ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
యూపీఐ లేదా ఆర్టీజీఎస్.. ఏది బెటర్..?
యూపీఐ లేదా ఆర్టీజీఎస్.. ఏది బెటర్..?
మానవత్వం చాటుకున్న నేస్తం.. కోతికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
మానవత్వం చాటుకున్న నేస్తం.. కోతికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
ఒకే గదికి ఏ ఏసీ ఉత్తమమైనది? తెలుసుకోవలసిన కీలక విషయాలు
ఒకే గదికి ఏ ఏసీ ఉత్తమమైనది? తెలుసుకోవలసిన కీలక విషయాలు
ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి ఇలా.. ఇంతకుముందెన్నడు చూడని వింత
ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి ఇలా.. ఇంతకుముందెన్నడు చూడని వింత