AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dorothy: డోరతి ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే..లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు!

Dorothy: డోరతి ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే..లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు!

Phani CH
|

Updated on: Nov 01, 2026 | 12:27 PM

Share

‘డోరతి’ సినిమా క్లైమాక్స్‌పై దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమాలో చూపించిన రొమాంటిక్‌ కిస్‌ ముగింపుకు బదులుగా తాను మరో క్లైమాక్స్‌ ఊహించానని చెప్పారు. పెళ్లి వేడుకలో కార్తీపై దాడికి వచ్చిన విలన్లను డోరతీ బ్రూస్‌ లీ తరహా మార్షల్‌ ఆర్ట్స్‌తో ఎదుర్కొనేలా ఆ సన్నివేశాన్ని రాసుకున్నారట. ఈ ప్రత్యామ్నాయ ముగింపు ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

డోరతి! ఇప్పుడీ సినిమా ఓ సెన్సేషన్. కార్తిక్ సుబ్బరాజు అవుట్ ఆఫ్ ది బాక్స్‌ ఆలోచనకు.. ఆ ఆలోచనకు రూరల్ నేపథ్యాన్ని.. గ్రామాల్లోని కుల పిచ్చిని, లింగ వివక్షనను జోడించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమాను విపరీతంగా ఆదరించారు. అందులోనూ ఈ మూవీ క్లైమాక్స్‌ను చాలా మంది కొనియాడారు. ట్రాన్స్‌జెండర్‌గా మారిన తన ఫ్రెండ్‌ను ప్రేయసిగా స్వీకరించి .. ముద్దు పెట్టే సీన్.. అందర్నీ కదిలించింది. అయితే కార్తిక్ సుబ్బరాజ్ మాత్రం ఇది డోరతి క్లైమాక్స్ కాదని.. తాను వేరే క్లైమాక్స్‌ను ఊహించానంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను అనుకున్న క్లైమాక్స్‌ ను సినిమా చూపించినట్టే వివరించారు. ఇప్పుడా క్లామాక్స్‌ కూడా అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒరిజినల్ క్లైమాక్స్‌ కంటే.. కార్తి చెప్పిన క్లైమాక్సే అదిరిపోయిందే కామెంట్ వస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ చెప్పిన ఆ క్లైమాక్స్ ఏంటంటే.. కార్తీ, డొరొతీ! డోరొతి అంటే సుబ్బు. సినిమాలో క్లైమాక్స్ లో వీళ్లద్దరి రొమాంటిక్ కిస్‌తో సినిమా ఎండ్ అవుతుంది.ఆ రొమాంటిక్ కిస్ తర్వాత వీరిద్దరూ మధురైకి తిరిగి వస్తారు. సన్నిహితుల సమక్షంలో వీళ్ల పెళ్లికి అంతా గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతుంటాయి. అంతా సంతోషంగా ఉన్న ఆ సమయంలో, ఆ జంటను ఎలాగైనా మట్టుబెట్టాలని డోరొతిగా మారిన సుబ్బు తండ్రి ‘విజిల్ వీరయ్య’ తన గ్యాంగ్‌తో అక్కడికి చేరుకుంటాడు. కత్తులతో ఎటాక్ చేయడానికి వచ్చిన వీరయ్యకు అక్కడ ఒక ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెళ్లి వస్త్రాల్లో ఉన్న డొరొతీని చూడగానే అతనికి చనిపోయిన తన కన్నతల్లి గుర్తొస్తుంది. ఆమె రూపంలో తన తల్లిని చూసుకుని మనసు కరిగిపోయిన వీరయ్య.. వెంటనే ఆ దాడులను ఆపి, ఆ జంటను వదిలేయాలంటూ తన కొడుకులను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ, పంతం మీద ఉన్న ఆ సోదరులు మాత్రం వెనక్కి తగ్గరు. “ఆమెను ఒక అమ్మాయిగా మనం అంగీకరించినా.. కార్తీ వేరే కులానికి చెందినవాడు కదా! కులాంతర వివాహం చేసుకుంటున్న అతనికి మన అమ్మాయిని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాం?” అంటూ వీరయ్యతో తీవ్ర వాగ్వాదానికి దిగుతారు. కుల పిచ్చితో రగిలిపోతూ కార్తీని చంపేందుకు విలన్లు ముందుకు దూకుతారు. సరిగ్గా అప్పుడే స్క్రిప్ట్‌లో ఊహించని బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. తన ప్రేమికుడిని చంపడానికి వస్తున్న వారి ముందు డొరొతీ భయంతో ఏడుస్తూ కూర్చోదు.. ఏకంగా బ్రూస్ లీ తరహాలో మార్షల్ ఆర్ట్స్ ఫైట్‌తో విలన్ల మీదకు సివంగిలా దూకుతుంది. ఎవరూ ఊహించని ఈ యాక్షన్ ఎపిసోడ్‌లో సుబ్బు చేసిన ఫైట్ స్క్రిప్ట్‌కే హైలైట్‌గా నిలిచింది. ఒక ఎమోషనల్ పాయింట్, పరువు హత్యల నేపథ్యం, దానికి తోడు బ్రూస్ లీ తరహా మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్.. ఈ ఒరిజినల్ క్లైమాక్స్ గనుక తెరమీద పడి ఉంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు! కదా..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rohit Elimination: సెలబ్రిటీల దెబ్బకు రోహిత్ ఎలిమినేషన్!

Bigg Boss 10 Telugu: చేతులారా చేసుకున్న ఫలితం.. బిగ్ బాస్ హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ ఔట్

ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

భారతీయ రైల్వే సరికొత్త సేవలు.. ఇకపై మీ ఇంటికే పార్శిల్‌!

రైలు ప్రయాణికులకు షాక్.. రాత్రిపూట ఛార్జింగ్‌ బంద్‌

Follow Us