AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

Phani CH
|

Updated on: Nov 01, 2026 | 11:15 AM

Share

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు మేదాంష్‌ రైక్వార్‌కు అదృష్టం వరించింది. కేవలం రూ.200తో కొనుగోలు చేసిన లక్కీ డ్రా కూపన్‌ ద్వారా ఏకంగా రూ.50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్‌ కారును గెలుచుకున్నాడు. గతేడాది గర్బా వేడుకల సందర్భంగా అతని అమ్మమ్మ కిరణ్‌ రైక్వార్‌ మనవడి పేరుతో కూపన్‌ కొనుగోలు చేశారు. కారు సొంతం కావడంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.

అదృష్టం కలిసొస్తే కటిక దరిద్రుడు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోతాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబానికి కూడా అలాంటి అదృష్టమే పట్టింది. కేవలం రూ.200 విలువైన కూపన్‌తో ఏకంగా రూ.50 లక్షల విలువైన ‘టయోటా ఫార్చ్యూనర్’ కారును గెలుచుకుని ఆ కుటుంబం వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌, సీలంపురకు చెందిన మేదాంష్ రైక్వార్ అనే ఆరేళ్ల బాలుడిని ఈ అదృష్టం వరించింది. గతేడాది అభాపురిలోని శ్రీ సర్కార్ ధామ్‌లో జరిగిన గర్బా వేడుకలకు హాజరైన మేదాంష్ అమ్మమ్మ కిరణ్ రైక్వార్, కేవలం రూ.200 లక్కీ డ్రా కూపన్ కొనుగోలు చేసి మనవడి పేరును నమోదు చేసింది. డ్రా ఫలితాలు ప్రకటించగా మొదటి బహుమతి మేదాంష్‌ను వరించింది. గత రెండేళ్లుగా ఒక సొంత కారు కొనుగోలు చేయాలని ఆశిస్తున్న ఆ కుటుంబానికి ఈ వార్త అంతులేని సంతోషాన్ని ఇచ్చింది. కారును సొంతం చేసుకుని ఊరికి తిరిగి వచ్చిన మేదాంష్‌కు, అతని కుటుంబానికి స్థానికులు, పొరుగువారు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. కారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. రూ.200తో రూ.50 లక్షల కారు గెలుచుకోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారతీయ రైల్వే సరికొత్త సేవలు.. ఇకపై మీ ఇంటికే పార్శిల్‌!

రైలు ప్రయాణికులకు షాక్.. రాత్రిపూట ఛార్జింగ్‌ బంద్‌

అర్ధరాత్రి ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం.. మగాడిలా అనిపించిందంటూ పోస్ట్‌

543 రకాల ఔషధాల ధరలు భారీగా తగ్గింపు..

Follow Us