543 రకాల ఔషధాల ధరలు భారీగా తగ్గింపు..
క్యాన్సర్ రోగులకు చికిత్స ఖర్చుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. NPPA 543 బ్రాండ్ల క్యాన్సర్ ఔషధాల గరిష్ఠ ధరలను తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. కొన్ని మందుల ధరలు 80 శాతానికి పైగా తగ్గాయి. బెవాసిజుమాబ్, ఫుల్‌వెస్ట్రాంట్, అజాసిటిడిన్ వంటి ఇంజెక్షన్ల ధరలు భారీగా దిగివచ్చాయి. కొత్త ధరలు నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో క్యాన్సర్ చికిత్స మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న రోగులకు, వారి కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన 543 బ్రాండ్ల ఔషధాల గరిష్ఠ విక్రయ ధరలను భారీగా తగ్గిస్తూ జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల నిర్ణయ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నూతన ధరలు నవంబరు 9 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని NPPA తీసుకున్న ఈ నిర్ణయంతో కొన్ని కీలకమైన క్యాన్సర్ మందుల ధరలు ఏకంగా 80 శాతానికి పైగా తగ్గాయి. ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ విధానం ద్వారా మందుల అమ్మకాలపై ఉన్న అధిక లాభాల మార్జిన్లకు కళ్లెం వేసి, సామాన్యులకు కూడా క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. బెవాసిజాబ్ ఇంజెక్షన్.. రూ. 21,767 నుంచి ఏకంగా రూ. 5,930కి తగ్గింది. ఫుల్‌వెస్ట్రాంట్ ఇంజెక్షన్.. రూ. 26,072 నుండి రూ. 5,491కి దిగివచ్చింది. అజాసిటిడిన్ ఇంజెక్షన్.. రూ. 6,337 నుంచి రూ. 1,495కి తగ్గింది. రొమ్ము, ప్రోస్టేట్, పెద్దప్రేగు, అండాశయ, గర్భాశయ క్యాన్సర్లతో పాటు 20కి పైగా రకాల క్యాన్సర్ల చికిత్సల్లో వాడే ఇమ్యునోథెరపీ, డెనోసుమాబ్, పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్ వంటి అత్యంత కీలకమైన మందులు ఈ జాబితాలో ఉన్నాయి. ఫార్మా కంపెనీలు అందించే మరిన్ని వివరాల ఆధారంగా ముందుముందు ఈ జాబితాను మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతిలోపు వర్షాలు కురిస్తే ఒకే.. లేకుంటే.. హైదరాబాద్‌లో తప్పని వాటర్ ఎమర్జెన్సీ
తిరుమలలోని శతాబ్దాల చరిత్రకు డిజిటల్ రక్షణ
కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం…
మీరు కొనేవన్నీ సన్నబియ్యమేనా..
తెలంగాణ ప్రభుత్వ కొత్త విప్లవం! ప్రభుత్వ పాలనలో ‘ఏఐ సాక్షమ్’
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!

