మీరు కొనేవన్నీ సన్నబియ్యమేనా..
హైదరాబాద్ కర్మన్‌ఘాట్ పరిధిలో రేషన్ బియ్యాన్ని బ్రాండెడ్ సన్నబియ్యంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉచిత రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి బీపీటీ, సోనామసూరి వంటి పేర్లతో అమ్ముతున్నట్లు గుర్తించినట్లు సమాచారం. రూ.500 విలువైన బియ్యాన్ని రూ.2,000 వరకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తూకంలో మోసాలు, ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న అంశాలపైనా అధికారులు దృష్టి పెట్టారు.
షాపులు, సూపర్ మార్కెట్లలో కర్నూలు రైస్, బీపీటీ, సోనామసూరి అని చెప్పగానే నమ్మి, వేలకు వేలు పోసి క్వింటాళ్లకు క్వింటాళ్లు కొనేస్తున్నారా? అయితే మీరు తినేది నిజంగా బ్రాండెడ్ బియ్యమేనా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిందే! రాజధాని హైదరాబాద్ నగరంలో బ్రాండెడ్ సన్నబియ్యం పేరుతో కొంతమంది కేటుగాళ్లు పెద్ద ఎత్తున దందాకు తెరలేపారు. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ పరిధిలోని పలు రైస్ డిపోలపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే రేషన్ దొడ్డు బియ్యాన్ని అక్రమంగా సేకరించి, వాటికి కెమికల్స్, పాలిషింగ్ పట్టి మెరిసే సన్నబియ్యంగా మారుస్తున్నారనే ఆరోపణలతో అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రూ.500 విలువ చేసే రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి, బ్రాండెడ్ సంచిల్లో నింపి ఏకంగా రూ.2,000లకు విక్రయిస్తున్నట్లు తేలింది. నాణ్యతలోనే కాకుండా తూకంలోనూ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. చాలా చోట్ల కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా లేకుండానే డిపోలను నిర్వహిస్తున్నారు. అధికారులు తనిఖీలకు రాగానే కొందరు వ్యాపారులు షాపులు మూసేసి పరారయ్యారు. నిబంధనలు ఉల్లంఘించి రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడుతున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ ప్రభుత్వ కొత్త విప్లవం! ప్రభుత్వ పాలనలో ‘ఏఐ సాక్షమ్’
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. KBR తరహాలో మరో వన్-వే లూప్.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఏపీలో పన్నీర్ బ్యాన్! హోటళ్లు, రెస్టారెంట్లలో ముమ్మర తనిఖీలు!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!

