హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. KBR తరహాలో మరో వన్-వే లూప్.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి నాలెడ్జ్ సిటీ వరకు కొత్త వన్-వే లూప్ ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీసులు ప్రతిపాదిస్తున్నారు. ఐకియా రోటరీ, మైండ్‌స్పేస్, డల్లాస్ సెంటర్, మై హోమ్ భూజా మీదుగా సాగే ఈ మార్గంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ట్రాఫిక్ సిమ్యులేషన్, ఐటీ సంస్థల అభిప్రాయాల తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
హైదరాబాద్ మహానగరంలో నేటి జీవనశైలి ఉరుకులు పరుగులమయంగా మారింది. ఐటీ రంగం విస్తరించడం, జనాభా పెరగడంతో నగర జీవితం 24 గంటలూ బిజీగా మారిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటున్నారు. బతుకు జీవన వేటలో కొందరు.. ఆఫీసులకు వెళ్లేందుకు మరికొందరు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఉనికి కోసం, కుటుంబ పోషణ కోసం నిరంతరం పరిగెడుతూనే ఉంటారు. ఈ బిజీ బిజీ లైఫ్‌లో ఒత్తిడితోపాటు సాధారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్.. నిత్యం ట్రాఫిక్‌లో నరకయాతన అనుభవించే వారు వేలాది మంది ఉంటారు.. అందుకే.. ఆ ట్రాఫిక్ ఏంట్రా బాబూ అంటూ తలపట్టుకుంటుంటారు.. అయితే.. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రోజువారీ ఆఫీస్ ట్రాఫిక్‌తో విసిగిపోయారా? గంటల తరబడి బయోడైవర్సిటీ, మైండ్‌స్పేస్ జంక్షన్ల దగ్గర నిరీక్షిస్తున్నారా? అయితే మీకో బిగ్ అలర్ట్! కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న వన్-వే మోడల్ తరహాలోనే… గ్రేటర్ హైదరాబాద్ ఐటీ హబ్‌లో మరో భారీ వన్-వే లూప్ సిస్టమ్ రాబోతోంది! అవును.. మీరు విన్నది నిజమే.. బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి నాలెడ్జ్ సిటీ వరకు ఈ రౌండ్ లూప్ మార్గాన్ని సైబరాబాద్ పోలీసులు సిద్ధం చేస్తున్నారు. అసలు ఈ కొత్త రూట్ ఎలా ఉండబోతోంది? ఐటీ ఉద్యోగులకు ఇది ఎంతవరకు ఉపశమనం కలిగిస్తుందో ఈ రోజు వీడియోలో క్లియర్‌గా చూసేద్దాం.. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉమ్మడిగా రూపొందిస్తున్న ఈ ప్రతిపాదిత లూప్ రూట్ మ్యాప్ ఒకసారి చూద్దాం.. బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ప్రారంభమవుతుంది. ఐకియా (IKEA) రోటరీ మీదుగా రహేజా మైండ్‌స్పేస్ సీ-గేట్, నాలెడ్జ్ సిటీ, డల్లాస్ సెంటర్ల వైపు సాగుతుంది. డల్లాస్ సెంటర్ నుంచి మై హోమ్ భూజా వద్ద రైట్ టర్న్ తీసుకుని తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈ విధంగా సర్క్యులర్ వన్-వే లూప్ ఏర్పాటు చేయడం వల్ల జంక్షన్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా వాహనాలు నిరంతరాయంగా సాగిపోతాయని.. అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను స్వయంగా పరిశీలించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్, ఎస్సీఎస్సీ సీఈవో నవీద్ ఖాన్ సహా ఉన్నతాధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రస్తుతం రహదారుల వెడల్పు, జంక్షన్ల వద్ద తలెత్తుతున్న బాటిల్ నెక్ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తదుపరి దశలో వాహనాల వేగం, ట్రాఫిక్ సాంద్రతను విశ్లేషించేందుకు ట్రాఫిక్ సిమ్యులేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఐటీ కంపెనీల ప్రతినిధులు, స్థానిక భాగస్వాములతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. తొందరపడకుండా దశలవారీగా ఈ వన్-వే లూప్ వ్యవస్థను అమలు చేస్తామని సీపీ వెల్లడించారు. వాహనదారులకు ఎలాంటి గందరగోళం లేకుండా రూట్ డైవర్షన్లు, ట్రాఫిక్ అడ్వైజరీల అధికారిక సమాచారాన్ని ముందుగానే మీడియా ద్వారా ప్రకటిస్తారు. ఈ విధానం అమల్లోకి వస్తే మైండ్‌స్పేస్, నాలెడ్జ్ సిటీ పరిసరాల్లో పీక్ అవర్స్‌లో రోడ్ల సామర్థ్యం పెరిగి… ఆఫీస్ సమయాల్లో ఉద్యోగులు, వాహనదారులు సమయం వృథా కాకుండా త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. “హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రాబోతున్న ఈ కేబీఆర్ మోడల్ వన్-వే లూప్ ప్లాన్‌పై మీ అభిప్రాయం ఏంటి? ఇది ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తుందని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో పన్నీర్ బ్యాన్! హోటళ్లు, రెస్టారెంట్లలో ముమ్మర తనిఖీలు!
రైతును నిలువునా ముంచేసిన సైబర్ నేరగాళ్లు!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. తాజ్ హోటల్ యాజమాన్యం ఏం చేసిందో తెలుసా!
వాహనదారులకు గుడ్ న్యూస్.. రూ.1500కే ఏడాది ఫాస్టాగ్ పాస్.. టోల్ ప్లాజా బాదుడుకు చెక్
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!

