పేడతోనే ఇన్ని అద్భుతాలా? 1,140 రెట్ల బలం.. ఈ పురుగు సొంతం! నక్షత్రాలే దీనికి దిక్సూచి
చూడటానికి చిన్నగా ఉండే పేడ పురుగులు చేసే పనులు తెలిస్తే ఆశ్చర్యపోతారు. తమకంటే పెద్ద పేడ బంతులను నెట్టుకుంటూ వెళ్లే ఈ జీవులు, కొన్ని జాతుల్లో పాలపుంత కాంతిని ఉపయోగించి దిశను కూడా గుర్తిస్తాయి. అసాధారణమైన బలం, పిల్లల పెంపకం, నేల సారాన్ని పెంచడంలో వాటి పాత్ర వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ఒక్కసారి ఊహించుకోండి.. మీరు మీకంటే పది రెట్లు పెద్ద వస్తువును ఒంటరిగా నెట్టుకుంటూ వెళ్లాలి! ఎంత కష్టంగా ఉంటుంది? కానీ ఈ చిన్న పురుగుకు మాత్రం అదో లెక్కే కాదు! తనకంటే పెద్ద పేడ బంతిని తయారుచేసి.. దాన్ని వెనక్కి నెట్టుకుంటూ కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది! ఇంకో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఇది రాత్రిపూట ఆకాశంలోని పాలపుంతను చూసి కూడా దారి గుర్తుపట్టగలదు! అదే పేడ పురుగు.. అంటే డంగ్ బీటిల్! చూడటానికి చిన్న పురుగే అయినా.. దీని లైఫ్‌లో మనల్ని ఆశ్చర్యపరిచే సూపర్ ఫ్యాక్ట్స్ చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం! ముందుగా ఈ పురుగులు పేడతో ఏం చేస్తాయో చూద్దాం! ఎక్కడైనా ఆవు, గేదె పేడ వేసిందంటే చాలు.. ఈ పురుగులు వెంటనే అక్కడికి చేరుకుంటాయి. తమ బలమైన ముందు కాళ్లతో పేడను సేకరించి.. దాన్ని గుండ్రని బంతిలా తయారుచేస్తాయి. ఆ తర్వాత.. ఆ బంతిని వెనక్కి నెట్టుకుంటూ అక్కడి నుంచి తీసుకెళ్తాయి! వినడానికి సినిమాటిక్‌గా ఉన్నా.. దీని వెనుక పెద్ద సైన్స్ ఉంది. పేడలో ఉండే పోషక పదార్థాలే వీటికి ఆహారం. కొన్ని జాతులు ఈ పేడ బంతులను ఆహారంగా ఉపయోగించుకుంటాయి. మరికొన్ని తమ పిల్లల కోసం ఆ బంతులను సిద్ధం చేస్తాయి. అంటే మనకు వ్యర్థంగా కనిపించే పేడ.. వీటికి ఫుడ్ ప్యాకెట్ అన్నమాట! ఇప్పుడు అసలు మాస్ విషయం చెబుతా! కొన్ని పేడ పురుగుల జాతుల్లో అద్భుతమైన బలాన్ని ప్రయోగించే సామర్థ్యం ఉంటుంది. ఒక పరిశోధన ప్రకారం.. ఈ పేడ పురుగు తన శరీర బరువుకు 1,140 రెట్లు సమానమైన బలాన్ని ప్రయోగించగలదు. అంటే తన సైజుతో పోలిస్తే అసాధారణమైన బలం దీని సొంతం అన్నమాట! ఒక్కసారి ఆలోచించండి.. మనిషికి కూడా అలాంటి బలం ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పురుగులోని అసలైన టాలెంట్ గురించి తెలుసుకుందాం. ఒక పేడ బంతిని తయారుచేసుకున్న తర్వాత.. అది నేరుగా తన గమ్యం వైపు వెళ్లిపోతుంది. మధ్యలో అటూ ఇటూ తిరగకుండా.. వీలైనంత త్వరగా తన బంతిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తుంది. మరి దానికి దారి ఎలా తెలుస్తుంది అనేది ఇక్కడ ఇంట్రస్టింగ్ టాపిక్.. కొన్ని జాతుల పేడ పురుగులు సూర్యుడు, చంద్రుడి వెలుతురును ఉపయోగించుకుని దిశను గుర్తిస్తాయి. అంతేకాదు.. 2013లో ప్రచురితమైన ఓ పరిశోధనలో ఆఫ్రికాకు చెందిన కొన్ని పేడ పురుగులు చీకటి రాత్రుల్లో పాలపుంత కాంతి ఆధారంగా కూడా దిశను గుర్తించగలవని పరిశోధకులు గుర్తించారు. అంటే మనం రాత్రిపూట ఆకాశంలో స్టార్స్ చూస్తే.. ఈ పురుగు మాత్రం వాటిని ఉపయోగించుకుని తన రూట్ ఫిక్స్ చేసుకుంటుందన్నమాట! ఇప్పుడు ఈ పురుగుల ఫ్యామిలీ లైఫ్ గురించి తెలుసుకుందాం. కొన్ని జాతుల ఆడ పేడ పురుగులు తమ పిల్లల కోసం ప్రత్యేకంగా పేడ బంతులను తయారుచేస్తాయి. ఆ బంతిలో చిన్న గదిలాంటి భాగాన్ని ఏర్పాటు చేసి.. అందులో గుడ్డు పెడతాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగు ఆహారం కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని చుట్టూ పేడ రూపంలోనే ఫుడ్ స్టోర్ ఉంటుంది! ఆ పేడనే తింటూ లార్వా పెరుగుతుంది. ఆ తర్వాత ప్యూపా దశకు చేరుకుని, క్రమంగా పూర్తిస్థాయి పేడ పురుగుగా మారుతుంది. అంటే పుట్టకముందే పిల్లల కోసం ఫుడ్, సేఫ్టీ అన్నీ రెడీ చేసేస్తాయన్నమాట! సరే.. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ప్రకృతికి ఈ పురుగులతో ఉపయోగమేంటి? చాలా ఉంది! పశువుల పేడను సేకరించి భూమిలోకి తీసుకెళ్లడం ద్వారా సేంద్రియ పదార్థాలు మట్టిలో కలిసేందుకు సహాయపడతాయి. వాటి సొరంగాల వల్ల నేలలోకి గాలి, నీరు వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. మట్టికి సహజంగా సారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని రకాల పరాన్నజీవుల వ్యాప్తిని కూడా తగ్గించడంలో సహాయపడతాయి. అంటే రైతులకు, పంటలకు, పర్యావరణానికి ఈ చిన్న జీవులు చేసే మేలు చాలా పెద్దది! చూశారుగా.. మనకు వ్యర్థంలా కనిపించే పేడను ఉపయోగించుకుని.. తన ఆహారాన్ని సంపాదించుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, ప్రకృతికి మేలు చేస్తోంది ఈ చిన్న జీవి. పాలపుంతను చూసి దారి గుర్తుపట్టే తెలివి.. తన బరువుకు మించిన బలాన్ని ప్రయోగించే సామర్థ్యం.. పర్యావరణానికి ఉపయోగపడే పనులు! నిజంగా చెప్పాలంటే.. సైజ్ చిన్నదే కావచ్చు.. కానీ ఈ పురుగు చేసే పనులు మాత్రం సూపర్! ప్రకృతిలో ఏ జీవినీ తక్కువ అంచనా వేయకూడదని చెప్పడానికి పేడ పురుగే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాంక్ ఖాతా లేకపోయినా మనీ పంపుకోవచ్చు.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే
పాలు కంటే మంచి కాల్షియం, ప్రొటీన్ అందించే ఆహారాలు ఇవే
పేడతోనే ఇన్ని అద్భుతాలా? 1,140 రెట్ల బలం..
చెట్టుపైనుంచి నోట్ల వర్షం.. అసలేం జరిగిందో మీరే చూడండి!
అమలాపురంలో అద్భుతం.. కొబ్బరికాయ నుంచి మొలిచిన రావిచెట్టు..
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..

