AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏఐతో పెను ప్రమాదం.. గూగుల్, మెటాపై కోర్టులో కేసు

ఏఐతో పెను ప్రమాదం.. గూగుల్, మెటాపై కోర్టులో కేసు

Phani CH
|

Updated on: Nov 16, 2026 | 5:06 PM

Share

అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని నిలిపివేయాలని కోరుతూ అమెరికాలోని నాలుగు లాభాపేక్షలేని సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. OpenAI, Google, Meta, Anthropic, SpaceX సంస్థలపై శాన్‌ఫ్రాన్సిస్కోలో కేసు దాఖలు చేశాయి. ఏఐ వల్ల సైబర్ దాడులు, మానవ నియంత్రణ కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ అభ్యర్థనపై కోర్టు ఇంకా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో దూసుకెళుతున్న గూగుల్, మెటా, ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి టెక్ దిగ్గజాలకు న్యాయపరంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ టెక్నాలజీ మానవాళి మనుగడకే పెను ముప్పుగా మారే ప్రమాదం ఉందని.. కాబట్టి అత్యంత శక్తిమంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ పలు లాభాపేక్షలేని సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ వంటి ఏఐ ఉత్పత్తుల తదుపరి అభివృద్ధిని నిరోధించాలని డిమాండ్ చేస్తూ శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో ఈ వ్యాజ్యం దాఖలు చేశాయి. ఇర్రిప్లేసబుల్ (Irreplaceable) ఎడ్యుకేషన్ ఫండ్, పబ్లిక్ సిటిజన్, హీట్ ఇనిషియేటివ్ వంటి సంస్థలు కలిసి ఈ పిటిషన్ వేశాయి. కాలిఫోర్నియాలోని ‘అన్యాయమైన వ్యాపార పద్ధతుల’ చట్టాలను ఆధారంగా చేసుకుని ఈ దావా వేశారు. ఆసక్తికరంగా ఈ వ్యాజ్యంలో ఏఐ కంపెనీల అధినేతల వ్యాఖ్యలనే సాక్ష్యాలుగా పొందుపరిచారు. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోదీ, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వంటి వారు గతంలో ఏఐ వల్ల నాగరికత నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించిన విషయాన్ని పిటిషనర్లు గుర్తుచేశారు. కొన్ని ఏఐ మోడళ్లు ఇప్పటికే పరీక్షల దశ నుంచి తప్పించుకుని ప్రభుత్వ వెబ్‌సైట్లపై స్వయంగా దాడులు చేసిన ఘటనలను కూడా ప్రస్తావించారు. ఇప్పటికే ఏఐ భద్రతపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయపోరాటం చేస్తున్నాయి. గత జూన్‌లో ఫ్లోరిడా అటార్నీ జనరల్ జేమ్స్ ఉత్మీయర్ ఓపెన్ఏఐపై దావా వేశారు. చాట్‌జీపీటీ ప్లాట్‌ఫామ్ పిల్లలకు హానికరమైన సమాచారాన్ని అందిస్తోందని, స్కూల్ షూటర్లకు సమాచారం ఇవ్వడం, ఆత్మహత్యలకు పురిగొల్పే సూచనలు చేయడం వంటి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఓపెన్ఏఐ, తమ శక్తిమంతమైన మోడళ్ల శిక్షణను తాత్కాలికంగా నిలిపివేశామని, మరిన్ని భద్రతా ప్రమాణాలు ఏర్పాటు చేశాకే ముందుకు వెళ్తామని తెలిపింది. ఇదిలా ఉండగా.. గత నెలలో మరో 8 రాష్ట్రాలు కలిసి ఓపెన్ఏఐపై దేశవ్యాప్తంగా వేర్వేరు కోర్టుల్లో కేసులు పెట్టాయి. మానవ విలువలకు కట్టుబడి ఉండేలా హామీ ఇవ్వకుండా, స్వీయ-అభివృద్ధి చేసుకునే ఏఐ మోడళ్లను తయారు చేయకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు చైనాతో పోటీని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ ప్రభుత్వం ఏఐపై కఠిన నిబంధనలు విధించడానికి విముఖత చూపుతుండగా, మరోవైపు ఈ న్యాయపోరాటాలు టెక్ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

పిజ్జా, బర్గర్ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. కేఎఫ్‌సీ, డొమినోస్ కిచెన్లలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు!

 

Follow Us