AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్, టెలిగ్రామ్‌లకు కొత్త రూల్స్

వాట్సాప్, టెలిగ్రామ్‌లకు కొత్త రూల్స్

Phani CH
|

Updated on: Nov 14, 2026 | 4:48 PM

Share

సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌లకు సిమ్ బైండింగ్ నిబంధనలను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. 2027 జనవరి నుంచి అమలులోకి రానున్న ఈ విధానంతో రిజిస్టర్డ్ సిమ్ ఫోన్‌లో యాక్టివ్‌గా ఉండాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారు, ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు వాడేవారు కొత్త నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

భారతదేశంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి ప్రముఖ సోషల్ మీడియా మరియు మెసేజింగ్ యాప్‌లు 2027 జనవరి నుంచి ‘సిమ్-బైండింగ్’ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. దీనివల్ల దేశంలోని కోట్లాది మంది వినియోగదారులపై ప్రభావం పడనుంది. మీరు ప్రస్తుతం యూపీఐ లేదా బ్యాంకింగ్ యాప్‌లను వాడుతున్నప్పుడు సిమ్ బైండింగ్ గురించి ఇప్పటికే చూసే ఉంటారు. మొబైల్ ఫోన్‌లో ఏ నంబర్‌తో అయితే రిజిస్టర్ అయ్యామో, అదే సిమ్ కార్డు ఆ ఫోన్‌లో యాక్టివ్‌గా ఉంటేనే ఆయా యాప్‌లు పనిచేస్తాయి. సరిగ్గా ఇదే విధానాన్ని ఇప్పుడు వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్‌లకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే, మీ ఫోన్‌లో రిజిస్టర్డ్ సిమ్ కార్డు లేకపోయినా, లేదా సరిగ్గా పనిచేయకపోయినా ఆ యాప్‌లు పనిచేయవు. ప్రస్తుతం చాలా మంది కేవలం ఓటీపీ ద్వారా వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసి, ఆ తర్వాత సిమ్ కార్డు లేకుండానే విదేశాల నుంచి లేదా వేరే పరికరాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు, డిజిటల్ అరెస్ట్ కుంభకోణాలకు పాల్పడే స్కామర్లు భారత్ వెలుపల కూర్చుని భారతీయ నంబర్లను దుర్వినియోగం చేయడానికి ఈ వెసులుబాటును వాడేస్తున్నారు. ఈ భద్రతా లోపాన్ని సరిదిద్దడమే సిమ్ బైండింగ్ ప్రధాన ఉద్దేశం. ఒకే ఫోన్‌లో రెండు కంటే ఎక్కువ వాట్సాప్ ఖాతాలను వాడేవారు లేదా ‘డ్యూయల్ స్పేస్’ వంటి ఫీచర్లు వాడేవారికి ఇబ్బందులు ఎదురుకావచ్చు. విదేశాలకు ప్రయాణించేవారు తమ ఫోన్‌లో భారతీయ సిమ్ కార్డును రోమింగ్‌లో యాక్టివ్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాట్సాప్ పనిచేయకపోవచ్చు. వ్యాపార అవసరాల కోసం ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ సాధనాల ద్వారా సందేశాలు పంపే వారికి ఈ నిబంధనల వల్ల కొన్ని సాంకేతిక అడ్డంకులు రావచ్చు. దీని అమలు గడువును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. సైబర్ నేరాలను అరికట్టడంలో ఈ నిబంధన ఎంతవరకు సఫలమవుతుందనేది వేచి చూడాల్సిందే!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ సెక్యూరిటీ!

ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా.. గుండెకు ముప్పు తప్పదు!

ఈ గింజలు గుప్పెడు తింటే చాలు.. పండ్లు, పాలు కంటే 5 రెట్లు ఎక్కువ శక్తి!

Follow Us