ఈ గింజలు గుప్పెడు తింటే చాలు.. పండ్లు, పాలు కంటే 5 రెట్లు ఎక్కువ శక్తి!
పొద్దుతిరుగుడు గింజలు పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం. వీటిలో విటమిన్ ఇ, విటమిన్ బి6, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. చర్మ ఆరోగ్యం, నరాల పనితీరు, శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో ఇవి సహాయపడతాయి. రోజుకు 25 నుంచి 40 గ్రాముల వరకు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నానబెట్టి లేదా డ్రై రోస్ట్ చేసి తినవచ్చు.
శరీరానికి పోషకాల లోపం తలెత్తితే అది అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో నిపుణులు సిఫార్సు చేస్తున్న అద్భుతమైన ఆహారాల్లో ‘సన్‌ఫ్లవర్ సీడ్స్’ (పొద్దుతిరుగుడు విత్తనాలు) ముందుంటాయి. కేవలం గుప్పెడు పొద్దుతిరుగుడు పప్పు చాలు.. శరీరానికి కావలసిన శక్తి, పోషకాలు పుష్కలంగా అందుతాయి. 100 గ్రాముల ఈ పప్పు బాదం పప్పుకు సమానమైన శక్తిని అందించడమే కాకుండా, చికెన్, మటన్ కంటే ఐదు రెట్లు అధిక బలాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజల్లో పోషకాల నిధి దాగి ఉంది. మానసిక ఆరోగ్యానికి, నరాల పనితీరు మెరుగుపడటానికి ‘విటమిన్ బి6’ చాలా కీలకం. ఇది జీర్ణకోశ సమస్యలను నిరోధించి, ఎంజైములు, హార్మోన్‌ల ఉత్పత్తికి, అలాగే రక్త ఉత్పత్తికి దోహదపడుతుంది. పొద్దుతిరుగుడు పప్పును నానబెట్టి తినడం ద్వారా విటమిన్ బి6 నశించకుండా పూర్తిగా శరీరానికి అందుతుంది. అలాగే, యవ్వనంగా ఉండటానికి, చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు ‘విటమిన్ ఇ’ అత్యంత ముఖ్యం. రోజూ శరీరానికి 15 మి.గ్రా. విటమిన్ ఇ అవసరం కాగా.. బాదం పప్పులో 28 మి.గ్రా. ఉండగా, పొద్దుతిరుగుడు పప్పులో ఏకంగా 35 మి.గ్రా. లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీలు యవ్వనంగా కనిపించడానికి విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడతారు. కానీ ఈ గింజల ద్వారా ఇది సహజంగా లభిస్తుంది. అంతేకాకుండా, నేటి కాలంలో చాలామందిలో కనిపించే మెగ్నీషియం లోపాన్ని నివారించడంలోనూ ఇవి నంబర్ వన్ ఆహారంగా నిలుస్తాయి. ఈ గింజలను ఉదయం నీటిలో నానబెట్టి సాయంత్రం పండ్లతో పాటు డిన్నర్‌లో తీసుకోవచ్చు. లేదా రాత్రి నానబెట్టి ఉదయం మొలకలతో పాటు తినవచ్చు. నానబెట్టడం వల్ల జీర్ణం సులువై పోషకాలు పూర్తిగా అందుతాయి. ప్రయాణాల్లో అయితే డ్రై రోస్ట్ చేసుకుని తినవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు తక్కువ మోతాదులో, బరువు పెరగాలనుకునేవారు రోజుకు 25-40 గ్రాముల వరకు తీసుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విరాట్ కోహ్లీతో మాట్లాడాలంటే కోచ్‌లు సైతం భయపడతారా?
అర్ధరాత్రి హాస్టల్లో కలకలం.. 10 మంది అమ్మాయిల జడలు కట్! అసలేం జరిగింది?
ఆ చెట్టుతో వాయు కాలుష్యానికి చెక్.. ఏపీలో పైలట్ ప్రాజెక్ట్‌గా అందుబాటులోకి!
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
ప్రశ్నించిన పాపానికి ప్రాణాల మీదకు వచ్చింది..!
అర్ధరాత్రి హాస్టల్లో కలకలం.. 10 మంది అమ్మాయిల జడలు కట్

