AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి హాస్టల్లో కలకలం.. 10 మంది అమ్మాయిల జడలు కట్! అసలేం జరిగింది?

అర్ధరాత్రి హాస్టల్లో కలకలం.. 10 మంది అమ్మాయిల జడలు కట్! అసలేం జరిగింది?

Phani CH
|

Updated on: Nov 12, 2026 | 1:29 PM

Share

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని బాలికల గురుకుల పాఠశాలలో వింత ఘటన కలకలం రేపుతోంది. రాత్రి నిద్రపోయిన పది మంది విద్యార్థినుల జడలు ఉదయం కత్తిరించి కనిపించాయి. గత వారం రోజులుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులే ఒకరి జుట్టును మరొకరు కత్తిరించుకున్నారని ప్రధానోపాధ్యాయురాలు చెబుతుండగా, పోలీసులు విచారణ చేపట్టారు.

పల్నాడు జిల్లాలోని ఓ బాలికల గురుకుల పాఠశాలలో వింత ఘటన కలకలం రేపుతోంది. రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్న బాలికలకు ఉదయం లేచేసరికి షాక్ తగులుతోంది. ఎందుకంటే రాత్రి పడుకునేటప్పుడు చక్కగా ఉన్న జడలు.. తెల్లారేసరికి కత్తిరించి కనిపిస్తున్నాయి. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పది మంది విద్యార్థినుల జడలు కత్తిరించి కనిపించాయి. దీంతో అసలు హాస్టల్లో ఏం జరుగుతోంది? విద్యార్థినుల జడలు కత్తిరిస్తున్నదెవరు? ఇది బయట వ్యక్తుల పనా? లేక తోటి విద్యార్థుల పనా? ఇప్పుడు ఈ ప్రశ్నలే తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సత్తెనపల్లి రూరల్ మండలం రామకృష్ణాపురంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినుల జడలు కత్తిరించినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాత్రి పడుకునే సమయంలో జడలు బాగానే ఉంటున్నాయని.. ఉదయం లేచి చూసేసరికి కత్తిరించి ఉంటున్నాయని విద్యార్థినులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు హాస్టల్లో నిద్రపోవాలంటే బాలికలు భయపడుతున్న పరిస్థితి ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. హాస్టల్లోకి బయటి వ్యక్తులు వస్తున్నారా? ఒకవేళ వస్తుంటే రాత్రి సమయంలో భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు? వార్డెన్ పర్యవేక్షణ ఎక్కడుంది? విద్యార్థినులు నిద్రిస్తున్న గదుల్లోకి ఎవరో వచ్చి జడలు కత్తిరిస్తుంటే సిబ్బందికి తెలియకపోవడం ఏంటి? ఇవే ఇప్పుడు తల్లిదండ్రుల ప్రశ్నలు. తమ పిల్లలకు భద్రత ఉంటుందనే నమ్మకంతో గురుకులంలో చేర్పిస్తే.. ఇలాంటి ఘటన జరగడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజనీకుమారి ఇచ్చిన వివరణ కూడా చర్చకు దారితీసింది. ప్రభుత్వం ఇటీవల అందించిన స్టేషనరీ కత్తెరలతో విద్యార్థినులే ఒకరి జుట్టును మరొకరు కత్తిరించుకున్నారని ఆమె చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఈ వివరణపై సంతృప్తిగా లేరు. గతంలోనూ విద్యార్థినుల చేతులపై గాయాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ హాస్టల్లో అసలు ఏం జరుగుతుందో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు పాఠశాలకు చేరుకుని విద్యార్థినులతో పాటు.. సిబ్బందిని విచారిస్తున్నారు. బయట వ్యక్తులు హాస్టల్లోకి వచ్చారా? లేక విద్యార్థినుల మధ్యే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే.. జడలు కత్తిరించింది ఎవరు అనేది తేలడం ఎంత ముఖ్యమో.. హాస్టల్లో ఉంటున్న బాలికలకు భద్రత ఉందనే నమ్మకం కల్పించడం కూడా అంతే ముఖ్యం. చిన్నారులు భయంతో నిద్రపోయే పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ వింత ఘటన వెనుక అసలు నిజం ఏంటి? పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ చెట్టుతో వాయు కాలుష్యానికి చెక్‌.. ఏపీలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా అందుబాటులోకి!

బాంబ్‌లా పేలిన ఫ్రిడ్జ్‌.. ఇల్లు దగ్ధం!

వామ్మో.. ఎంత పెద్ద చేపో.. జాలరి పంట పండిందిగా!

వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్‌!

ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు! IRCTCకి వినియోగదారుల కమిషన్ షాక్!

Follow Us