వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్!
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని బంధబైలు వాగులో భారీ మొసలి ప్రత్యక్షమైంది. చేపల వేటకు వెళ్లిన స్థానికులు దాన్ని చూసి భయంతో పరుగులు తీశారు. మొసలి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాగును దాటే గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి మొసళ్లను గుర్తించి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ పరిధిలోని బంధబైలు వాగు ప్రాంతంలో భారీ మొసలి ప్రత్యక్షమయింది. వాగు గట్టుపైకి వచ్చి సేదతీరుతున్న ఆ మొసలి దూరంనుంచి చూస్తే అదొక రాయిలా కనిపించింది. చేపల వేటకు వెళ్లిన కొందరు స్థానికులు దగ్గరకు వెళ్ళి చూడగా అది మొసలి అని గమనించి భయంతో వెనక్కి పరుగెత్తారు. ఆ తర్వాత గట్టున కదలకుండా ఉన్న ఆ మొసలిని తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారాయి. బంధబైలు – బోనకలమామిడి గ్రామాల మధ్య ఉన్న ఈ వాగుకు అవతలి వైపు బెన్నవరం, నక్కబొక్కల కొత్తూరు, బోనకలమామిడి, పోతురాజుగుమ్మాలు వంటి అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు తమ రోజువారీ పనుల కోసం నిత్యం ఈ వాగును దాటుతూనే రాకపోకలు సాగిస్తుంటారు. వాగులో భారీ మొసలి ప్రత్యక్షమవ్వడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానిక గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల కురిసిన ‘ఆర్నబ్’ తుపాను సమయంలో వచ్చిన భారీ వరద ప్రవాహానికి ఈ మొసలి కొట్టుకొచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా ఈ వాగు ప్రాంతంలో పలు మొసళ్లు కనిపిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి వాగులో ఉన్న మొసళ్ల ఆచూకీని గుర్తించాలని, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రజలకు ప్రమాదం కలగకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకునే వరకు గ్రామస్తులు, ప్రయాణికులు వాగులోకి దిగకుండా, దాటే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు! IRCTCకి వినియోగదారుల కమిషన్ షాక్!
రజనీ ‘ధర్మన్’లో రామ్ పోతినేని పవర్ ప్యాక్డ్ ఎంట్రీ.. బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర గ్యారంటీ!
ఇంటి ఆవరణలో భారీ శబ్దాలు.. పొదల చాటున సీన్ చూసి గుండె గుభేల్
విమాన టికెట్లు బుక్ చేశాక రైలు టికెట్లు కన్ఫామ్.. రైల్వేకు రూ.19,000 జరిమానా!
బీచ్ ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ తిమింగలం.. స్థానికులు ఏం చేశారో చూడండి!
వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్!
ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు!
ఇంటి ఆవరణలో భారీ శబ్దాలు.. పొదల చాటున సీన్ చూసి గుండె గుభేల్
విమాన టికెట్లు బుక్ చేశాక రైలు టికెట్లు కన్ఫామ్.. కట్ చేస్తే
ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ తిమింగలం.. స్థానికులు ఏం చేశారంటే
డబ్బులు ఆదా చేద్దామని రైలెక్కాడు.. చివరకు లబోదిబోమంటూ..
కేరళ ఏనుగు పిల్ల 'మాయ'కు వంతారా ఊపిరి..

