విమాన టికెట్లు బుక్ చేశాక రైలు టికెట్లు కన్ఫామ్.. రైల్వేకు రూ.19,000 జరిమానా!
వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న రైలు టికెట్లు కన్ఫామ్ కాకపోవడంతో విమాన టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుడికి చివరకు న్యాయం జరిగింది. విమానం బుక్ చేసిన 19 నిమిషాలకే రైలు టికెట్లు కన్ఫామ్ కావడంతో రీఫండ్ పొందలేకపోయాడు. ఎనిమిదేళ్ల తర్వాత కేరళ వినియోగదారుల కమిషన్ దక్షిణ రైల్వేకు రూ.19,700 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న రైలు టికెట్లు కన్ఫామ్ కాకపోవడంతో ప్రయాణికులు గందరగోళానికి గురికావడం తరచూ చూస్తుంటాం. ప్రయాణ సమయం దగ్గరపడుతున్నా రైలు టికెట్లు కన్ఫామ్ కాకపోవడంతో విమాన టికెట్లు బుక్ చేసుకున్న 19 నిమిషాలకే రైల్వే నుంచి కన్ఫర్మేషన్ మెసేజ్ రావడం, ఆపై రీఫండ్ రాకపోవడంతో ఓ ప్రయాణికుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పునిచ్చింది. అసలేం జరిగిందంటే…కేరళకు చెందిన దిలీప్ కుమార్ తన కుమార్తెతో కలిసి 2018 జూన్ 22న ఢిల్లీలోని ఐఎమ్‌డీ కార్యాలయంలో జరిగే ఉద్యోగ పత్రాల పరిశీలనకు హాజరయ్యేందుకు బయలుదేరారు. తిరుగు ప్రయాణం కోసం మే 24నే ఐఆర్‌సీటీసీ ద్వారా ఒక స్లీపర్, ఒక థర్డ్ ఏసీ టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే ఆ రెండూ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండిపోయాయి. జూన్ 22న సాయంత్రం 7.20 గంటలకు ఢిల్లీలోని ఐఆర్‌సీటీసీ కేంద్రంలో విచారించినా టికెట్లు కన్ఫామ్ కాలేదని తెలిసింది. దీంతో ఇక రైలు ప్రయాణం సాధ్యం కాదని భావించి వారు వెంటనే విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. తీరా విమాన టికెట్లు బుక్ చేసుకున్న 19 నిమిషాలకే అంటే సాయంత్రం 7 గంటల 39 నిమిషాలకు రైలు టికెట్లు కన్ఫామ్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వారు ప్రయాణించాల్సిన రైలు రాత్రి 11.35 గంటలకు బయలుదేరాల్సి ఉంది. రైల్వే నిబంధనల ప్రకారం రీఫండ్ రావాలంటే రైలు బయలుదేరడానికి కనీసం 4 గంటల ముందే టికెట్ రద్దు చేసుకోవాలి. కానీ ఇంటర్నెట్ సమస్యల వల్ల రాత్రి 8.45 గంటలకు టికెట్లు రద్దు చేయడంతో గడువు ముగిసి రీఫండ్ పొందలేకపోయారు. విమాన ఖర్చులతో పాటు రైలు టికెట్ల డబ్బులు కూడా నష్టపోవడంతో దిలీప్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణలో దక్షిణ రైల్వే, ఐఆర్‌సీటీసీ తమకు బాధ్యత లేదని వాదించినప్పటికీ కేరళ జిల్లా వినియోగదారుల కమిషన్ ఆ వాదనలను తోసిపుచ్చింది. రైలు బయలుదేరడానికి నాలుగు గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్లు కన్ఫామ్ అయినట్లు సమాచారం ఇవ్వడం వల్ల ప్రయాణికుడికి రీఫండ్ పొందే సమయం లేకుండా పోయిందని, ఇది స్పష్టంగా రైల్వే సేవాలోపమేనని నిర్ధారించింది. ఐఆర్‌సీటీసీకి ఈ వ్యవహారంలో ప్రత్యక్ష పాత్ర లేనందున దానికి మినహాయింపునిచ్చింది. ఈ కేసులో ప్రయాణికుడికి కలిగిన నష్టానికి పరిహారంగా మొత్తం రూ.19,700 చెల్లించాలని దక్షిణ రైల్వేను ఆదేశిస్తూ 2026 అక్టోబర్ 27న తీర్పునిచ్చింది. నెల రోజుల్లోగా ఈ సొమ్ము చెల్లించకపోతే న్యాయపరమైన ఖర్చులు మినహా మిగిలిన మొత్తంపై ఏటా 9 శాతం వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బీచ్ ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ తిమింగలం.. స్థానికులు ఏం చేశారో చూడండి!
డబ్బులు ఆదా చేద్దామని రైలెక్కాడు.. చివరకు లబోదిబోమంటూ..
విమాన టికెట్లు బుక్ చేశాక రైలు టికెట్లు కన్ఫామ్.. కట్ చేస్తే
ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ తిమింగలం.. స్థానికులు ఏం చేశారంటే
డబ్బులు ఆదా చేద్దామని రైలెక్కాడు.. చివరకు లబోదిబోమంటూ..
కేరళ ఏనుగు పిల్ల 'మాయ'కు వంతారా ఊపిరి..
ఎన్‌క్లోజర్ కింద సొరంగం తవ్వి మరీ పారిపోయిన పులి
హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి
భారీ మొసలి కలకలం.. భయాందోళనలో జనం!

