AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బులు ఆదా చేద్దామని రైలెక్కాడు.. చివరకు లబోదిబోమంటూ..

డబ్బులు ఆదా చేద్దామని రైలెక్కాడు.. చివరకు లబోదిబోమంటూ..

Phani CH
|

Updated on: Nov 12, 2026 | 11:43 AM

Share

పండుగ సమయంలో విమాన టికెట్ల ధరలు పెరగడంతో రైలు ప్రయాణాన్ని ఎంచుకున్న CEO వైభవ్ జైన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇండోర్ నుంచి లక్నోకు కుటుంబంతో ప్రయాణించిన ఆయన ఎక్కిన మహాకాల్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 8 గంటలు ఆలస్యమైంది. దీంతో రైల్వే శాఖపై ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన భారతీయ రైళ్ల సమయపాలనపై మరోసారి చర్చకు దారితీసింది.

పండుగ వేళ విమాన ఛార్జీలు ఆకాశాన్ని తాకడంతో బడ్జెట్ ఆదా చేసుకునేందుకు రైలు ప్రయాణాన్ని ఎంచుకున్న ఓ కంపెనీ సీఈవోకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు కుటుంబంతో సహా ప్రయాణించిన ప్రముఖ వ్యాపారవేత్త వైభవ్ జైన్.. తాను ఎక్కిన మహాకాల్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 8 గంటలు ఆలస్యంగా నడవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘క్యాపిటల్ క్విల్’, ‘వైభవ్ జైన్ క్లాసెస్’ వ్యవస్థాపకుడైన వైభవ్ జైన్ దీపావళి పండుగ జరుపుకొనేందుకు కుటుంబంతో కలిసి లక్నో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. పండుగ రద్దీ వల్ల విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరగడం, మరోవైపు తన రెండేళ్ల కుమార్తెకు మంచి ప్రయాణ అనుభూతిని ఇవ్వాలనే ఆలోచనతో ఆయన రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రయాణం 14 గంటల్లో పూర్తి కావాల్సి ఉండగా, రైలు దాదాపు ఏడున్నర నుంచి ఎనిమిది గంటలు ఆలస్యంగా నడవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ పరిణామంపై ఆయన ‘ఎక్స్’ వేదికగా రైల్వే మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ తన నిరాశను వ్యక్తం చేశారు. “రైల్వేలు ఇలాంటి జాప్యాలతో విమానయాన సంస్థలతో ఎలా పోటీపడగలవు? రైలు ప్రయాణాన్ని ఎంచుకుని పెద్ద తప్పు చేశాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. పలువురు నెటిజన్లు భారతీయ రైళ్ల సమయపాలన లోపాలను ఎత్తిచూపుతూ ఆయనకు మద్దతు తెలిపారు. మరికొందరు మాత్రం పండుగల సీజన్ రద్దీ, ట్రాక్ విస్తరణ పనుల వల్లే ఈ తరహా ఆలస్యం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. పండుగల సమయంలో విమాన ఛార్జీలు సాధారణం కంటే మూడు, నాలుగు రెట్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ఎక్కువగా ఆధారపడే రైల్వే సేవల్లో పారదర్శకత, సమయపాలన మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్‌క్లోజర్ కింద సొరంగం తవ్వి మరీ పారిపోయిన పులి

హాట్ టాపిక్‌గా.. అనిరుధ్ – కావ్యమారన్‌ పెళ్లి సందడి

చిరిగిన రూ.20 నోటు.. కస్టమర్‌ను కొట్టి చంపిన సిబ్బంది! ఇంత అన్యాయమా?

మతిపోయే కాన్సెప్ట్.. జక్కన్న ఊహ వేరే లెవల్‌..వారణాసి సినిమా స్టోరీ లీక్

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలకు వెళ్లే రైళ్లు రద్దు..

Follow Us