చిరిగిన రూ.20 నోటు.. కస్టమర్‌ను కొట్టి చంపిన సిబ్బంది! ఇంత అన్యాయమా?
హైదరాబాద్ అత్తాపూర్‌లో చిరిగిన రూ.20 నోటు విషయంలో జరిగిన చిన్న గొడవ విషాదంగా మారింది. వైన్ షాప్ సిబ్బందితో వాగ్వాదం సందర్భంగా బస్ డ్రైవర్ బోయ నాగరాజుపై దాడి చేయడంతో ఆయన కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో చిన్న చిన్న కారణాలకే మనుషుల ప్రాణాలు తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం చిరిగిన రూ.20 నోటు విషయంలో మొదలైన గొడవ చివరకు ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అత్తాపూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. అత్తాపూర్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 140 సమీపంలోని ఓ వైన్ షాప్ దగ్గర ఆదివారం ఈ ఘటన జరిగింది. మేడ్చల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న 43 ఏళ్ల బోయ నాగరాజు.. తన బంధువు బాలకృష్ణతో కలిసి మద్యం సేవించడానికి అక్కడికి వెళ్లాడు. ఉదయం 10 గంటల నుంచి ఇద్దరూ మద్యం సేవిస్తున్నట్లు బాలకృష్ణ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లిన నాగరాజు షాప్ లో చిరిగిన రూ.20 నోటు ఇచ్చాడు. అయితే ఆ నోటును తీసుకోవడానికి వైన్ షాప్ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ గొడవలో బన్నీ అనే వైన్ షాప్ ఉద్యోగి బయటకు వచ్చి నాగరాజుపై దాడి చేసి, అతణ్ణి బలంగా తోసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నాగరాజు సమీపంలోని టెలికాం కంపెనీ స్తంభం కాంక్రీట్ బేస్‌పై పడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు నాగరాజును అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తన భర్త ఉదయం 9 గంటల సమయంలో కూతురిని ఉద్యోగానికి తీసుకెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారని.. ఆ తర్వాత ఈ ఘటన జరిగిందని నాగరాజు భార్య జయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరిగిన రూ.20 నోటు విషయంలో జరిగిన గొడవే తన భర్త మరణానికి కారణమైందని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులు బన్నీపై BNSలోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేశారు. ఇది హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్యకు సంబంధించిన సెక్షన్. సోమవారం నిందితుణ్ణి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తంగా.. కేవలం రూ.20 నోటు విషయంలో మొదలైన చిన్నపాటి గొడవ.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో చేసిన దాడి ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. చిన్న చిన్న వివాదాలను సంయమనంతో పరిష్కరించుకోవాల్సింది పోయి.. చేయి చేసుకుంటే ఇలాంటి విషాదాలే ఎదురవుతాయని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మతిపోయే కాన్సెప్ట్.. జక్కన్న ఊహ వేరే లెవల్..వారణాసి సినిమా స్టోరీ లీక్
శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలకు వెళ్లే రైళ్లు రద్దు..
అబ్బో.. తేజ్ భార్య బ్యాగ్రౌండ్.. చాలా పెద్దదే.. ఆస్తులు కోట్లలోనే..
Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని.. తారక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు
‘శ్రీరాముడిగా’ సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే ‘రామాయణ’ సినిమా ప్రకటన.. కానీ…
హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి
భారీ మొసలి కలకలం.. భయాందోళనలో జనం!
మహిళా ఉద్యోగులకు రూ.3 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్..
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన

