AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని.. తారక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు

Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని.. తారక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు

Phani CH
|

Updated on: Nov 11, 2026 | 2:52 PM

Share

స్టూడెంట్ నెం 1 సినిమా విడుదలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితులను నటుడు రాజీవ్ కనకాల గుర్తు చేసుకున్నారు. తాను పెద్ద స్టార్ అవుతానా అని తారక్ అడిగిన విషయాన్ని వెల్లడించారు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా ఎన్టీఆర్ తన పాత స్నేహితులను మర్చిపోలేదని ప్రశంసించారు. అలాగే దర్శకుడు రాజమౌళి ఎదుగుదల, ఆయన సాధించిన అంతర్జాతీయ గుర్తింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

స్టూడెంట్ నెం 1 చిత్రం విడుదల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అనుభవించిన భావోద్వేగాలు, అలాగే రాజమౌళి ఎదుగుదల వెనుక ఉన్న అంకితభావం, వినయం గురించి టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.వీరిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా స్టూడెంట్ నెం 1. ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో కీలక మలుపు. అయితే ఈ సినిమా విడుదల ముందు తారక్ తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యారని రాజీవ్ కనకాల గుర్తు చేసుకున్నారు. “రాజా, స్టూడెంట్ నెం 1 సినిమా హిట్ అవుతుందంటావా? నేను స్టార్ అవుతానంటావా?” అని ఎంతో భావోద్వేగంతో తారక్ తనతో మాట్లాడారని రాజీవ్ కనకాల గుర్తు చేసుకున్నారు. “నువ్వు చాలా పెద్ద స్టార్ అవుతావు. 17 ఏళ్ల తర్వాత నువ్వు మమ్మల్ని కూడా మర్చిపోయే అంత పెద్ద స్టార్ అవుతావు” అంటూ తాను ధైర్యం చెప్పేవాడినని రాజీవ్ చెప్పుకొచ్చారు. అయితే, 17 సంవత్సరాలు దాటి, దాదాపు 25 సంవత్సరాలు గడిచినా జూనియర్ ఎన్టీఆర్ తన తోటి మనుషులను, తన ప్రారంభ దశలో అండగా నిలిచిన వారిని మర్చిపోలేదని.. అప్పుడు ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. నేడు జూనియర్ ఎన్టీఆర్ ఒక గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా, ఆయనలోని ఈ గుణం ఎందరికో ఆదర్శమని అన్నారు. ఎస్.ఎస్. రాజమౌళిని జక్కన్న అని ఆప్యాయంగా పిలుస్తామని… ఆయన ప్రస్థానం శాంతినివాసం అనే సీరియల్ రోజుల నుండి ప్రారంభమైందని తెలిపారు. నేడు, తారక్ మాదిరిగానే, రాజమౌళి కూడా ప్రపంచం మెచ్చిన దర్శకుడిగా ఎదిగారని.. ఆయన కీర్తి ప్రతిష్టలు కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాయని అన్నారు. దీనికి నిదర్శనంగా, ఫ్రాన్స్‌లోని ఒక ప్రతిష్టాత్మక సంస్థలో ఆయన పేరు మీద ఒక బ్రాస్ నేమ్‌ప్లేట్ ఏర్పాటు కావడం. ఇది మామూలు ఘనత కాదు, ఇది భారతీయులందరికీ, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ గొప్ప గర్వకారణమని రాజీవ్ చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘శ్రీరాముడిగా’ సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే ‘రామాయణ’ సినిమా ప్రకటన.. కానీ…

పవన్ కల్యాణ్ వ్యక్తిగత వ్యవహారంపై.. వైసీపీ కీలక ప్రకటనలు..

సినిమా మార్కెటింగ్ పై.. హీరోల, ప్రొడ్యూసర్ల తీరుపై.. RGV మార్క్‌ విశ్లేషణ!

Janhvi Kapoor: ముక్కు సర్జరీ తర్వాతే.. అమ్మ నన్ను హీరోయిన్‌గా నమ్మింది!

Ramayana: ‘రామాయణ’ సినిమాకు వెళుతున్నారా? అయితే థియేటర్లలో ఈ పనులు చేస్తే జైలుకే..

Follow Us