AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: ముక్కు సర్జరీ తర్వాతే.. అమ్మ నన్ను హీరోయిన్‌గా నమ్మింది!

Janhvi Kapoor: ముక్కు సర్జరీ తర్వాతే.. అమ్మ నన్ను హీరోయిన్‌గా నమ్మింది!

Phani CH
|

Updated on: Nov 11, 2026 | 1:18 PM

Share

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. హీరోయిన్ కావాలనే తన కోరికపై శ్రీదేవికి మొదట్లో నమ్మకం లేదని తెలిపింది. ముఖ్యంగా తన నోస్ సర్జరీ తర్వాతే తనలో హీరోయిన్ అయ్యే అర్హత ఉందని అమ్మ భావించిందని జాన్వీ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది నటి జాన్వీ కపూర్. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తనదైన నటన, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే, జాన్వీ హీరోయిన్ కావడం ఆమె తల్లి శ్రీదేవికి మొదట్లో అంతగా ఇష్టం లేదనే వార్త మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దానికి తోడు తన నోస్ సర్జరీ తర్వాతే.. తన తల్లి తనను హీరోయిన్‌గా నమ్మింది అంటూ జాన్వీ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ, మహేశ్వరి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనుకున్నంత సులభం కాదని శ్రీదేవి భావించేవారని గుర్తు చేసుకున్నారు. కేవలం అందం, నటన ఉంటే సరిపోదని.. పరిశ్రమలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను తట్టుకోవడానికి ఎంతో ధైర్యం, అంకితభావం అవసరమని శ్రీదేవి చెప్పేవారట. తన కూతురు ఈ ఒత్తిళ్లను తట్టుకోగలదా లేదా అని శ్రీదేవి తీవ్రంగా ఆలోచించేవారని మహేశ్వరి తెలిపారు. ఇక ఇదే విషయం పై జాన్వీ కపూర్ స్పందిస్తూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. “నేను హీరోయిన్ అవ్వగలను అనే నమ్మకం నా తల్లికి మొదట్లో లేదు. ముఖ్యంగా నాకు ముక్కు సర్జరీ జరగకముందు వరకు అమ్మ శ్రీదేవికి నా లుక్స్, కేపాబిలిటీపై పూర్తి నమ్మకం కుదరలేదు. కానీ, ఆ సర్జరీ పూర్తయ్యాక నా మేక్‌ఓవర్ చూసి, నాలో హీరోయిన్ అయ్యే అర్హత ఉందని అమ్మ భావించింది. ఆ తర్వాతే నేను సినిమాల్లోకి రావడానికి అంగీకరించింది. అని జాన్వీ తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ramayana: ‘రామాయణ’ సినిమాకు వెళుతున్నారా? అయితే థియేటర్లలో ఈ పనులు చేస్తే జైలుకే..

Suriya: కర్ర విరగకుండ పాము చావ కుండ! పొలిటికల్ ఎంట్రీ పై సూర్య అతి తెలివి కామెంట్

Follow Us