AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: కర్ర విరగకుండ పాము చావ కుండ! పొలిటికల్ ఎంట్రీ పై సూర్య అతి తెలివి కామెంట్

Suriya: కర్ర విరగకుండ పాము చావ కుండ! పొలిటికల్ ఎంట్రీ పై సూర్య అతి తెలివి కామెంట్

Phani CH
|

Updated on: Nov 11, 2026 | 1:16 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వస్తున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేసిన సూర్య.. రాజకీయాలను ద్వేషించడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతం సూర్య చేసిన ఈ కామెంట్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులలో కూడా ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా నిలిచాయి.

కోలీవుడ్ ఇండస్ట్రీలో పొలిటికల్ ఎంట్రీ రూమర్స్ ఎప్పటి నుంచో తెగ వైరలవుతున్నాయి. ఇప్పటికే హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ధనుష్ ఈ ప్రచారం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు హీరో సూర్య కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు మరో టాక్ కోలీవుడ్‌లో మొదలైంది. అయితే ధనుష్‌లా సైలెంట్‌ ఉండకుండా.. ఈ రూమర్స్ పై ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీపావళి పండగ కానుకగా.. సూర్య సీన్ రిలీజ్ అయింది. ఆ సినిమా మంచి టాక్‌ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. దీంతో ఈ మూవీ విజయోత్సవ సభ రీసెంట్‌గా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లోనే సూర్య.. తాను రాజకీయాల్లోకి ప్రవేశించబోనని క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటే.. రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించడానికి ఆసక్తిగా ఉన్నానని కూడా మరో స్టేట్టెంట్‌ ఇచ్చారు. నేను రాజకీయాల్లోకి ప్రవేశించడం లేదు. అంతమాత్రాన రాజకీయాలంటే ద్వేషం అని కాదు. నేను రాజకీయాలను నిశ్శబ్దంగా, నిశితంగా గమనిస్తున్నా.. అంటూ సూర్య చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. సూర్య ఫ్యాన్ పేజెస్‌లో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐపీఎల్ 2027లో ఊహించని మలుపు.. పంజాబ్‌కు హార్దిక్, ముంబయికి అర్ష్‌దీప్

కిలాడీ లేడీలు.. మాటల్లో పెట్టి మాయం చేసారు

హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి

ఆర్టీసీ – మెట్రో ఉమ్మడి పాస్‌ ధర భారీగా తగ్గింపు

నిరుద్యోగ యువతకు.. గుడ్‌న్యూస్‌

Follow Us