హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి
ముంబైకి చెందిన జినియా ఛటర్జీ వేక్‌ఫిట్ స్లీప్ ఇంటర్న్‌షిప్ ఐదో సీజన్‌లో విజేతగా నిలిచారు. రెండు నెలల పాటు నిద్ర వేళలు, నిద్ర సరళిని పాటిస్తూ నిర్వహించిన ఈ పోటీలో గెలిచి రూ.9.6 లక్షల నగదు బహుమతితో పాటు ఉచిత విహారయాత్రను గెలుచుకున్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన 2 లక్షలకు పైగా దరఖాస్తుల నుంచి ఎంపికైన 10 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన కరీం ఖాన్ వైల్డ్‌కార్డ్ ద్వారా ఫైనల్‌కు చేరుకున్నారు.
బాగా నిద్రపోవడం అనేది కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, కొన్నిసార్లు ఊహించని అదృష్టాన్ని, భారీ బహుమతులను కూడా తెచ్చిపెడుతుందని నిరూపించింది ముంబైకి చెందిన జినియా ఛటర్జీ. ప్రముఖ పరుపుల తయారీ సంస్థ ‘వేక్‌ఫిట్’ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఐదో సీజన్ ‘స్లీప్ ఇంటర్న్‌షిప్’ పోటీలో ఆమె విజేతగా నిలిచింది. ఈ పోటీలో గెలుపొందడం ద్వారా రూ. 9.6 లక్షల భారీ నగదు బహుమతితో పాటు ఒక ఉచిత విహార యాత్రను కూడా ఆమె కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా వచ్చిన 2 లక్షలకు పైగా దరఖాస్తుల నుంచి కఠినమైన వడపోత తర్వాత 10 మందిని ఈ పోటీకి ఎంపిక చేశారు. రెండు నెలల పాటు సాగిన ఈ ఇంటర్న్‌షిప్‌లో ప్రతిరోజూ తగినంత సమయం నిద్రపోవడం, సరిగ్గా నిద్ర వేళలు పాటించడం, నిద్ర సరళిని ట్రాక్ చేయడం వంటివి ప్రధాన నిబంధనలుగా పెట్టారు. అయితే ఇది కేవలం నిద్రకే పరిమితం కాకుండా, పోటీదారుల సృజనాత్మకతను పరీక్షించేందుకు వారానికోసారి ప్రత్యేక ఛాలెంజ్‌లు కూడా నిర్వహించారు. ‘స్లీప్ సినిమా’ పేరుతో సినిమాల్లోని సన్నివేశాలను నిద్ర థీమ్‌తో రీక్రియేట్ చేయడం, ‘స్లీప్ బింగో’ ద్వారా అలవాట్లను సమీక్షించుకోవడం, అలాగే ‘అండర్‌కవర్ స్లీప్ మిషన్’లో సంభాషణల మధ్యలో ఎదుటివారికి తెలియకుండా ‘దుప్పటి’ లేదా ‘దిండు’ అనే పదాలను 10 సార్లు వాడటం వంటి ఆసక్తికరమైన టాస్క్‌లు పెట్టారు. వీటిలో రాణించిన వారికి ‘ప్రో స్లీపర్ ఆఫ్ ది వీక్’ అవార్డులు ఇచ్చారు. చివర్లో రత్నగిరి మణికందన్, జినియా ఛటర్జీ, మెహెక్ ఖోట్ టాప్-3గా నిలవగా.. అత్యధిక వారపు ఛాలెంజ్‌లలో గెలిచిన హైదరాబాద్‌కు చెందిన కరీం ఖాన్ వైల్డ్ కార్డ్ ద్వారా ఫైనల్ చేరాడు. అనంతరం నిర్వహించిన ‘బిగ్ బెడ్డ్’ గ్రాండ్ ఫినాలేలో ‘మెమరీ ఫోమ్ ఛాలెంజ్’, ‘స్లీప్ ఆక్షన్’ వంటి టాస్క్‌లు నిర్వహించి, చివరి రాత్రి నిద్ర స్కోర్ల ఆధారంగా జినియా ఛటర్జీని విజేతగా ప్రకటించారు. 2019లో ప్రారంభమైన ఈ పోటీ ద్వారా ఇప్పటివరకు 65 మంది తలా రూ. 1 లక్ష స్టైఫండ్ అందుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్టీసీ – మెట్రో ఉమ్మడి పాస్ ధర భారీగా తగ్గింపు
నిరుద్యోగ యువతకు.. గుడ్‌న్యూస్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. మరో 2 కొత్త ఎయిర్‌పోర్టులకు గ్రీన్ సిగ్నల్
ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్! తెలంగాణ గ్రామాల్లో డిజిటల్ విప్లవం!
హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి
భారీ మొసలి కలకలం.. భయాందోళనలో జనం!
మహిళా ఉద్యోగులకు రూ.3 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్..
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన

