ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. మరో 2 కొత్త ఎయిర్‌పోర్టులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ స్థల అనుమతులు ఇచ్చింది. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీకాకుళంలో ఈ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు కానున్నాయి. శ్రీకాకుళం విమానాశ్రయానికి రూ.750.52 కోట్లు, కుప్పం ప్రాజెక్టుకు రెండు దశల్లో రూ.1,142 కోట్ల వ్యయం అంచనా వేశారు. భూసేకరణ, నిర్మాణ విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ప్రతిపాదించిన మొత్తం 9 కొత్త విమానాశ్రయాల్లో ప్రస్తుతం ఈ రెండింటికి అనుమతులు లభించాయి.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది.. రాష్ట్రంలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్థల అనుమతులు (Site Clearance) జారీ చేసింది. చిత్తూరు జిల్లా కుప్పం, అలాగే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాల్లో ఈ నూతన ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి. ఇప్పటికే ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేయగా… ప్రభుత్వం భూసేకరణ, అభివృద్ధి నమూనాలపై కసరత్తు వేగవంతం చేసింది.. అసలు ఈ ప్రాజెక్టుల బడ్జెట్ ఎంత? ఎప్పటికి ఇవి అందుబాటులోకి రాబోతున్నాయి? ఏపీలో ప్రతిపాదించిన మిగతా 7 ఎయిర్‌పోర్టులు ఏవో ఈ రోజు వీడియోలో ఇన్-డెప్త్‌గా చూద్దాం! కేంద్రం అనుమతి ఇచ్చిన ఈ రెండు ఎయిర్‌పోర్టుల మాస్టర్ ప్లాన్, అంచనా వ్యయాల వివరాలు ఒకసారి చూద్దాం: శ్రీకాకుళం ఎయిర్‌పోర్ట్: ఈ ప్రాజెక్ట్ కోసం రూ.750.52 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. దీనికి మొత్తం 1,185 ఎకరాల భూమి అవసరం కానుండగా… 2030 నాటికి ఈ ఎయిర్‌పోర్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుప్పం ఎయిర్‌పోర్ట్: తొలి దశలో రూ.734 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా… రెండు దశలు కలిపి మొత్తం రూ.1,142 కోట్ల వ్యయం కానుంది. ఈ ప్రాజెక్ట్‌కు 1,788 ఎకరాలు అవసరం కాగా… ఇప్పటికే 1,300 ఎకరాల సేకరణ పూర్తయింది! భూసేకరణకు ప్రభుత్వం రూ.198.75 కోట్లు కేటాయించింది. ఈ విమానాశ్రయాల నిర్మాణాన్ని PPP పద్దతిలో.. అంటే.. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో చేపట్టాలా లేదా ప్రభుత్వ-యజమాని భాగస్వామ్యంలో చేయాలా అనే దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 కొత్త విమానాశ్రయాలను రూ.6,418 కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అవేంటంటే.. నాగార్జునసాగర్, తాడేపల్లిగూడెం, ఒంగోలు, అనంతపురం, అమరావతి, దగదర్తి, తుని-అన్నవరం, శ్రీకాకుళం – కుప్పం.. పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద ‘ఉడాన్ 2.0’ పథకం కింద ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని కోరగా… ప్రస్తుతానికి శ్రీకాకుళం, కుప్పంలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇటీవలే ఉత్తరాంధ్రలో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.. ప్రయాణికులకు, సరుకు రవాణాకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం, కుప్పం ఎయిర్‌పోర్టులకు కూడా అనుమతులు రావడంతో… త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగం పుంజుకోనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్! తెలంగాణ గ్రామాల్లో డిజిటల్ విప్లవం!
భారీ మొసలి కలకలం.. భయాందోళనలో జనం!
మహిళా ఉద్యోగులకు రూ.3 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్..
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన
అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అడ్డంగా దోచేశారు!

