సినిమా మార్కెటింగ్ పై.. హీరోల, ప్రొడ్యూసర్ల తీరుపై.. RGV మార్క్ విశ్లేషణ!
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భారీ సినిమా బడ్జెట్లు, హీరోల పారితోషికాలు, బాక్సాఫీస్ విజయాలపై ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఆమీర్ ఖాన్ గజిని, తారే జమీన్ పర్ సినిమాల వ్యూహాన్ని ఉదాహరణగా చూపించారు. స్టార్‌డమ్ కంటే కథపై నమ్మకం, సరైన బడ్జెట్‌తో సినిమాలు నిర్మించడం ముఖ్యమని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. భారీ బడ్జెట్లు సినిమాల విజయాన్ని నిర్ణయించవని వివరించారు.
ప్రస్తుత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫైనాన్సియల్ అండ్ క్రియేటివ్ సవాళ్లపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన స్టైల్లో విశ్లేషణ చేసి రీసెంట్ ఇంటర్వ్యూలో వివరించారు. పెద్ద హీరోలు అధిక పారితోషికం తీసుకుంటూ, భారీ బడ్జెట్ చిత్రాలలోనే నటించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు వారి నుంచి అధిక అంచనాలను పెట్టుకోవడం దీనికి కారణం అన్నారు. ఉదాహరణకు, మన ఇండస్ట్రీ పెద్ద హీరోలు 127 అవర్స్ వంటి ప్రయోగాత్మక చిత్రం చేస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా.? అన్నది ప్రశ్నార్థకం. స్టార్‌డమ్ అంటే కేవలం నటుడి స్క్రీన్ ప్రజెన్స్ అని, కథ కంటే కాస్టింగ్ ఫ్యాక్టర్ ముఖ్యమని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ అనుసరించిన వినూత్న మార్కెటింగ్ వ్యూహాన్ని వర్మ ప్రస్తావించారు. ఆమీర్ గజిని వంటి పెద్ద హిట్ తర్వాత, తారే జమీన్ పర్ వంటి చిన్న, ఆర్ట్-హౌస్ సినిమాను తక్కువ బడ్జెట్‌తో నిర్మించి, దానిని గజిని అమ్మిన ధరలో 10వ వంతుకే అమ్మేశారన్నారు. ఈ లాజిక్ ప్రకారం, తక్కువ ధరలో అమ్మి, తక్కువ వసూళ్లు వచ్చినా సినిమా విజయం సాధించినట్లు అవుతుంది, దానివల్ల పెట్టుబడిపై రాబడి పెరుగుతుంది. ఇది భారతీయ సినీ పరిశ్రమలో చాలా మంది అనుసరించని లాజిక్ అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. భారీ బడ్జెట్ కారణంగా రాధే శ్యామ్ వంటి చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదని, బాహుబలి సినిమాలో నటించిన నటులు హిందీ ప్రేక్షకులకు తెలియకపోయినా, భారీ విజువల్స్ కారణంగా విజయం సాధించిందని వర్మ విశ్లేషించారు,. ఆర్జీవీ తన సొంత సినిమాలైన శివ, సత్యలను ఉదాహరణగా చూపుతూ, తనకు ఆనందం కలిగించిన కథలనే తక్కువ బడ్జెట్‌తో, వాస్తవిక లొకేషన్లలో, పక్కా ప్లాన్ తో తీశానని వివరించారు. సినిమాకు ఏం అవసరమో దానికే ఖర్చు చేశానని, డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో చాలా మందికి ఆడియన్స్ టేస్ట్ గురించి తక్కువ అవగాహన ఉంటుందని, ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుందో లేదా ఫ్లాప్ అవుతుందో అర్థం చేసుకోలేరని ఆర్జీవీ అన్నారు. అలాగే చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ అనే ఇరానియన్ చిత్రాన్ని ఇండియాలో తార రం పం పేరుతో రీమేక్ చేసిన విధానాన్ని వివరిస్తూ, అసలు సినిమా వెనుక ఉన్న ఉద్దేశ్యం మారిపోయి, వ్యాపార లాభాల కోసం ప్రయత్నించినప్పుడు ఎలాంటి నష్టాలు సంభవిస్తాయో.. ఆర్జీవీ ఉదహరించారు. హానెస్టీ అలాగే మెయిన్ పాయింట్ నుంచి డైవర్ట్ అవ్వడం వల్ల చిత్రనిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం, గదర్ 2 , యానిమల్, స్త్రీ 2 వంటి విభిన్న చిత్రాలు విజయం సాధిస్తుండటాన్ని బట్టి, ప్రేక్షకులు ఏదైనా చూస్తారని స్పష్టమవుతోందని, కాబట్టి చిత్రనిర్మాతలు తమ సొంత నమ్మకాన్ని అనుసరించడమే సరైన మార్గమని ఆర్జీవీ అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janhvi Kapoor: ముక్కు సర్జరీ తర్వాతే.. అమ్మ నన్ను హీరోయిన్‌గా నమ్మింది!
Ramayana: ‘రామాయణ’ సినిమాకు వెళుతున్నారా? అయితే థియేటర్లలో ఈ పనులు చేస్తే జైలుకే..
Suriya: కర్ర విరగకుండ పాము చావ కుండ! పొలిటికల్ ఎంట్రీ పై సూర్య అతి తెలివి కామెంట్
హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి
భారీ మొసలి కలకలం.. భయాందోళనలో జనం!
మహిళా ఉద్యోగులకు రూ.3 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్..
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
షాపులోకి సడన్గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన

