మతిపోయే కాన్సెప్ట్.. జక్కన్న ఊహ వేరే లెవల్..వారణాసి సినిమా స్టోరీ లీక్
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై ఆసక్తికరమైన స్టోరీ థియరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుంభకర్ణుడి పునర్జన్మగా పృథ్వీరాజ్ పాత్ర, రావణుడి తొమ్మిది వజ్రాలు, కాల ప్రయాణం చుట్టూ కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కథ నిజమేనా? సినిమాలో అసలు ట్విస్ట్ ఏమిటనేది అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీయెస్ట్ సినిమాల్లో ఇప్పుడు ‘వారణాసి’ టాప్ లో ఉంది. మహేశ్ బాబు హీరో కాగా లేటెస్ట్ ట్రెండింగ్ సబ్జెక్ట్ డివోషనల్ కాన్సెప్ట్ ఇందులో కీలకం. అయితే ‘వారణాసి’ ప్రపంచం ఎలా ఉండబోతుందో ఓ మూడు నిమిషాల గ్లింప్స్‌తో చూపించిన జక్కన్న.. మిగతా ఏ డీటైల్స్ బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నాడు. కానీ విచిత్రంగా ఈ సినిమా స్టోరీ బయటికి వచ్చేసింది. ఇదేనని సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది.రాజమౌళి చెప్పిన దాని ప్రకారం ‘వారణాసి’లో ప్రస్తుతంతో పాటు రాముడు జీవించిన త్రేతాయుగం సీన్స్ కూడా ఉండనున్నాయి. ఇందులో భాగంగా మహేశ్.. శ్రీరాముడిగానూ కనిపించనున్నాడు. అయితే అసలు కథ అంతకు మించి ఉందని సోషల్ మీడియాలో థియరీలు కనిపిస్తున్నాయి. దీని ప్రకారం స్టోరీ ఇలా ఉండనుందట. కుంభకర్ణుడే పునర్జన్మ ఎత్తి విలన్ కుంభ(పృథ్వీరాజ్ సుకుమారన్)గా మారతాడు. కాలు కూడా కదపలేని ఇతడు.. తన సోదరుడు రావణుడికి చెందిన తొమ్మిది వజ్రాలని ఎలాగైనా సొంతం చేసుకోవాలని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ వజ్రాలు.. రామ-రావణ యుద్ధం జరిగినప్పుడు చెల్లాచెదురు అయిపోయి వేర్వేరు దేశాల్లోకి వెళ్లిపోతాయి. కుంభ కాలు కదపలేడు కాబట్టి వాటిని తీసుకురమ్మని రుద్ర(మహేశ్ బాబు)ని పంపిస్తాడు. ఈ క్రమంలోనే రుద్ర.. రామాయణం జరిగిన కాలంలోకి ప్రయాణిస్తాడు. ఇక్కడే అసలు ట్విస్ట్.వజ్రాల దక్కించుకుంటున్న టైంలో రుద్రకి కుంభ అసలు లక్ష్యమేంటో తెలుస్తుంది. దీంతో వాటిని కుంభకి దక్కనీయకుండా చేయాలని గతంలోకి ప్రయాణిస్తాడు. రామ-రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు వజ్రాలు విడిపోకుండా చేస్తాడు. దీంతో ప్రస్తుతంలో కుంభ మనసులో వజ్రాల్ని దక్కించుకోవాలనే ఆలోచన రాదు. అలా కథ సమాప్తం.వినడానికి విజువల్‌గా ఊహించుకోవడానికి హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ కథలా ఉంది గానీ మరి నిజమా కాదా అనేది ‘వారణాసి’ రిలీజైతే గానీ చెప్పలేం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలకు వెళ్లే రైళ్లు రద్దు..
అబ్బో.. తేజ్ భార్య బ్యాగ్రౌండ్.. చాలా పెద్దదే.. ఆస్తులు కోట్లలోనే..
Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని.. తారక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు
‘శ్రీరాముడిగా’ సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే ‘రామాయణ’ సినిమా ప్రకటన.. కానీ…
హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి
భారీ మొసలి కలకలం.. భయాందోళనలో జనం!
మహిళా ఉద్యోగులకు రూ.3 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్..
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన

