AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాట్ టాపిక్‌గా.. అనిరుధ్ - కావ్యమారన్‌ పెళ్లి సందడి

హాట్ టాపిక్‌గా.. అనిరుధ్ – కావ్యమారన్‌ పెళ్లి సందడి

Phani CH
|

Updated on: Nov 11, 2026 | 5:45 PM

Share

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ పెళ్లి వార్త కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్, ఎంకే స్టాలిన్ కుటుంబాలు కూడా వేడుకకు హాజరవుతున్నట్లు సమాచారం. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం కోలీవుడ్ సినీ వర్గాల్లోనూ, వ్యాపార వర్గాల్లోనూ ఒకటే వార్త మారుమోగుతోంది. అదే ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌ల పెళ్లి ముచ్చట. చెన్నైలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ గ్రాండ్ వెడ్డింగ్ గురించే చర్చ జరుగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్‌తో అనిరుధ్ ఏడడుగులు వేయబోతున్నారు. ఈ వివాహ వేడుక కోసం ఇరు కుటుంబ సభ్యులు విదేశీ ప్రయాణమయ్యారు. సుందరమైన గ్రీస్ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 10, 11 తేదీల్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు చెన్నై నుంచి పలువురు ప్రముఖులు ఇప్పటికే గ్రీస్‌కు బయలుదేరి వెళ్లారు. అనిరుధ్‌కు దగ్గరి బంధువైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరవుతున్నారు. అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబం కూడా పెళ్లిలో పాల్గొనేందుకు గ్రీస్ వెళ్లడం విశేషం. విమానాశ్రయంలో వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ముగిసిన అనంతరం, ఈ జంట నవంబర్ 21న చెన్నైలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల కోసం గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకతో కోలీవుడ్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిరిగిన రూ.20 నోటు.. కస్టమర్‌ను కొట్టి చంపిన సిబ్బంది! ఇంత అన్యాయమా?

మతిపోయే కాన్సెప్ట్.. జక్కన్న ఊహ వేరే లెవల్‌..వారణాసి సినిమా స్టోరీ లీక్

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలకు వెళ్లే రైళ్లు రద్దు..

అబ్బో.. తేజ్‌ భార్య బ్యాగ్రౌండ్.. చాలా పెద్దదే.. ఆస్తులు కోట్లలోనే..

Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని.. తారక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు

Follow Us