AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు! IRCTCకి వినియోగదారుల కమిషన్ షాక్!

ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు! IRCTCకి వినియోగదారుల కమిషన్ షాక్!

Phani CH
|

Updated on: Nov 12, 2026 | 12:30 PM

Share

రైలు టికెట్ రద్దు చేసుకున్న ప్రయాణికుడికి రావాల్సిన రీఫండ్‌లో ఒక్క రూపాయి తక్కువగా జమ చేసిన ఐఆర్‌సీటీసీకి కేరళ వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. కాసరగోడ్‌కు చెందిన సంజయ్ రాజ్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్.. బకాయి రూపాయితో పాటు రూ.100 పరిహారం, రూ.3,000 కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. మొత్తంగా ఆయనకు రూ.3,100 అదనంగా అందనున్నాయి.

ఒకే ఒక్క రూపాయి కోసం ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కుతారా? సరే పోనీ.. ఆ ఒక్క రూపాయి కోసం న్యాయపోరాటం చేసి.. ఏకంగా మూడువేల వంద రూపాయలు పరిహారం గెలుచుకుంటే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ ఘటన కేరళలో జరిగింది. రైలు టికెట్ రద్దు చేసుకున్న ఓ ప్రయాణికుడికి రావాల్సిన రీఫండ్‌లో ఒక్క రూపాయి తక్కువగా జమ కావడంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ జరిపిన కమిషన్.. ఐఆర్‌సీటీసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆ ఒక్క రూపాయి వ్యవహారం ఏంటి? ఏం జరిగింది? డీటెయిల్డ్ గా చూద్దాం. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన 31 ఏళ్ల సంజయ్ రాజ్ ఈ న్యాయపోరాటం చేశారు. 2024 ఆగస్టు 11న ఐఆర్‌సీటీసీ ద్వారా ఏసీ త్రీ టైర్ రైలు టికెట్ బుక్ చేసుకున్నారు. ఇందుకోసం రూ.553 చెల్లించారు. ఆగస్టు 20న ప్రయాణించాల్సి ఉండగా.. మూడు రోజుల ముందే అంటే ఆగస్టు 17న టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు. నిబంధనల ప్రకారం రద్దు రుసుముగా రూ.180, దానిపై జీఎస్టీగా మరో రూ.9 కలిపి మొత్తం రూ.189 మినహాయించారు. దీంతో ఆయనకు తిరిగి రావాల్సిన మొత్తం రూ.341. కానీ ఐఆర్‌సీటీసీ మాత్రం ఆయన ఖాతాలో రూ.340 మాత్రమే జమ చేసింది. అంటే ఒక్క రూపాయి తక్కువగా ఇచ్చింది. ఈ ఒక్క రూపాయి తేడాపైనే సంజయ్ రాజ్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారాన్ని ఆయన అంత తేలిగ్గా వదిలేయలేదు. తనకు రావాల్సిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించకపోవడం సేవల్లో లోపమని ఆరోపిస్తూ కాసరగోడ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కారణంగా తనకు మానసిక ఒత్తిడి, ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొంటూ పరిహారం కోరారు. “మానసిక వేదనకు లక్ష రూపాయలు, నమ్మకద్రోహానికి మరో లక్ష రూపాయలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.” వీటితో పాటు వ్యాజ్యపు ఖర్చులు, బకాయి ఉన్న ఒక్క రూపాయి కూడా చెల్లించాలని కోరారు. మొత్తంగా రూ.2,05,001 చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన వినియోగదారుల కమిషన్.. ప్రయాణికుడికి రావాల్సిన మొత్తం రూ.341 కాగా, కేవలం రూ.340 మాత్రమే జమ కావడాన్ని గుర్తించింది. మిగిలిన ఒక్క రూపాయి ఎందుకు చెల్లించలేదనే దానికి ఐఆర్‌సీటీసీ సరైన వివరణ ఇవ్వలేకపోయిందని పేర్కొంది. కచ్చితంగా చెల్లించాల్సిన రీఫండ్‌ను పూర్తిగా ఇవ్వకపోవడం సేవా లోపమేనని, ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ఒక్క రూపాయి తక్కువ చెల్లించినంత మాత్రాన ఆ తప్పును తేలిగ్గా తీసుకోలేమని కమిషన్ అభిప్రాయపడింది. దీంతో ప్రయాణికుడి ఫిర్యాదును పాక్షికంగా అనుమతిస్తూ ఐఆర్‌సీటీసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందుగా బకాయి ఉన్న ఒక్క రూపాయిని తిరిగి చెల్లించాలని, దానిపై టికెట్ రద్దు చేసిన తేదీ నుంచి 9 శాతం వడ్డీ కూడా ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు సేవా లోపానికి పరిహారంగా రూ.100, కేసు ఖర్చుల కింద మరో రూ.3,000 చెల్లించాలని స్పష్టం చేసింది. అంటే వడ్డీ, బకాయి ఉన్న ఒక్క రూపాయి కాకుండా ప్రయాణికుడికి అదనంగా రూ.3,100 అందనున్నాయి. ఈ మొత్తాన్ని ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోగా చెల్లించాలని ఐఆర్‌సీటీసీని ఆదేశించింది. అక్టోబర్ 5, 2026న కాసరగోడ్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఈ తీర్పును వెలువరించింది. మొత్తానికి రైల్వే టికెట్ రీఫండ్‌లో ఒక్క రూపాయి తేడా వచ్చినా.. దాన్ని ప్రశ్నించే హక్కు ప్రయాణికుడికి ఉంటుందని ఈ తీర్పు స్పష్టం చేసింది. చిన్న మొత్తమే కదా అని వినియోగదారుల హక్కులను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదనే సందేశాన్ని ఇచ్చింది. ప్రయాణికుడికి చెల్లించాల్సిన ప్రతి రూపాయికి సంస్థలు జవాబుదారీగా ఉండాల్సిందేనని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రజనీ ‘ధర్మన్’లో రామ్ పోతినేని పవర్ ప్యాక్డ్ ఎంట్రీ.. బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర గ్యారంటీ!

ఇంటి ఆవరణలో భారీ శబ్దాలు.. పొదల చాటున సీన్‌ చూసి గుండె గుభేల్‌

విమాన టికెట్లు బుక్ చేశాక రైలు టికెట్లు కన్ఫామ్.. రైల్వేకు రూ.19,000 జరిమానా!

బీచ్‌ ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ తిమింగలం.. స్థానికులు ఏం చేశారో చూడండి!

డబ్బులు ఆదా చేద్దామని రైలెక్కాడు.. చివరకు లబోదిబోమంటూ..

Follow Us