వామ్మో.. ఎంత పెద్ద చేపో.. జాలరి పంట పండిందిగా!
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని వేలువెన్ను లాకుల వద్ద జాలర్ల వలకు 10 కేజీల భారీ పండుగప్ప చేప చిక్కింది. ఎర్రకాలువలో వరద ప్రవాహం పెరగడంతో చేపలు కాలువల్లోకి వస్తున్నాయి. ఈ భారీ చేపకు మార్కెట్‌లో రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలుకుతుందని మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. చేపను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.
ఆహా.. జాలర్ల పంట పండింది.. చేపల కోసం కాలువలో వల వేస్తే భారీ పండుగప్ప చిక్కింది. ఏకంగా 10 కేజీల బరువున్న పండుగప్ప వలకు చిక్కడంతో మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ పరిధిలోని వేల్పూరు – వేలువెన్ను లాకుల వద్ద ఈ ఘటన జరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతం నుంచి చేపలు ఎదురెక్కుతూ కాలువల్లోకి కొట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో స్థానిక మత్స్యకారులు వేలువెన్ను లాకుల వద్ద చేపల వేటకు దిగారు. వేసిన కొద్దిసేపటికే వల ఒక్కసారిగా బరువెక్కింది. తోటి జాలర్లతో కలిసి వలను ఒడ్డుకు లాక్కొచ్చి చూడగా సుమారు భారీ పండుగప్ప చేప దర్శనమిచ్చింది. సాధారణంగా సముద్రం, నదీ ముఖద్వారాల్లో కనిపించే ఈ పండుగప్ప చేపకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీని రుచి అద్భుతంగా ఉండటంతో మాంసాహార ప్రియులు ఎంత ధరైనా చెల్లించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. తాము పట్టిన ఈ 10 కేజీల భారీ చేప బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.6,000 నుంచి రూ.8,000 వరకు ధర పలుకుతుందని జాలర్లు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక కాలువలో ఇంత పెద్ద పండుగప్ప చేప పడిందన్న వార్త ఆనోటా ఈనోటా పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో, స్థానికులు భారీగా లాకుల వద్దకు చేరుకుని ఆ చేపను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్!
ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు! IRCTCకి వినియోగదారుల కమిషన్ షాక్!
రజనీ ‘ధర్మన్’లో రామ్ పోతినేని పవర్ ప్యాక్డ్ ఎంట్రీ.. బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర గ్యారంటీ!
ఇంటి ఆవరణలో భారీ శబ్దాలు.. పొదల చాటున సీన్ చూసి గుండె గుభేల్
విమాన టికెట్లు బుక్ చేశాక రైలు టికెట్లు కన్ఫామ్.. రైల్వేకు రూ.19,000 జరిమానా!
వామ్మో.. ఎంత పెద్ద చేపో.. జాలరి పంట పండిందిగా!
వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్!
ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు!
ఇంటి ఆవరణలో భారీ శబ్దాలు.. పొదల చాటున సీన్ చూసి గుండె గుభేల్
విమాన టికెట్లు బుక్ చేశాక రైలు టికెట్లు కన్ఫామ్.. కట్ చేస్తే
ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ తిమింగలం.. స్థానికులు ఏం చేశారంటే
డబ్బులు ఆదా చేద్దామని రైలెక్కాడు.. చివరకు లబోదిబోమంటూ..

