బాంబ్‌లా పేలిన ఫ్రిడ్జ్.. ఇల్లు దగ్ధం!
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ పరిధిలోని హైదర్ షాకోట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ పేలడంతో ఇంట్లో మంటలు చెలరేగి గృహోపకరణాలు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఉద్యోగానికి వెళ్లిన ఇంటి యజమాని దంపతులు సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్నారు. ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలడంతో ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని హైదర్ షాకోట్ 123వ డివిజన్ శివ సాయి నగర్ ఫేజ్-2లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంటి యజమాని దంపతులు ఇద్దరూ ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఫ్రిడ్జ్ పేలింది. దీంతో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, ఫర్నిచర్ ఇతర సామగ్రికి అంటుకున్నాయి. ఇంటి నుంచి భారీగా పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే యజమానులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన వారు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. రద్దీగా ఉండే నివాస ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదంలో ఇంట్లోని విలువైన వస్తువులు, సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విద్యుత్ ఉపకరణాలను వాడేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఎంత పెద్ద చేపో.. జాలరి పంట పండిందిగా!
వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్!
ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు! IRCTCకి వినియోగదారుల కమిషన్ షాక్!
రజనీ ‘ధర్మన్’లో రామ్ పోతినేని పవర్ ప్యాక్డ్ ఎంట్రీ.. బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర గ్యారంటీ!
ఇంటి ఆవరణలో భారీ శబ్దాలు.. పొదల చాటున సీన్ చూసి గుండె గుభేల్
బాంబ్‌లా పేలిన ఫ్రిడ్జ్.. ఇల్లు దగ్ధం!
వామ్మో.. ఎంత పెద్ద చేపో.. జాలరి పంట పండిందిగా!
వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్!
ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు!
ఇంటి ఆవరణలో భారీ శబ్దాలు.. పొదల చాటున సీన్ చూసి గుండె గుభేల్
విమాన టికెట్లు బుక్ చేశాక రైలు టికెట్లు కన్ఫామ్.. కట్ చేస్తే
ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ తిమింగలం.. స్థానికులు ఏం చేశారంటే

