AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా.. గుండెకు ముప్పు తప్పదు!

ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా.. గుండెకు ముప్పు తప్పదు!

Phani CH
|

Updated on: Nov 14, 2026 | 4:38 PM

Share

రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు, జిమ్‌లో వ్యాయామం చేసేందుకు ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? అధిక కెఫీన్ ఉండే ఈ పానీయాలతో గుండె సమస్యల ముప్పు పెరగవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గుండె ఆగిపోవడం, గుండెపోటు, గుండె లయ తప్పడం వంటి ఘటనలు ఎక్కువగా నమోదైనట్లు అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

రోజంతా ఉత్సాహంగా ఉండటానికి, జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చడానికి చాలామంది ఎనర్జీ డ్రింక్స్, ప్రీ-వర్కౌట్ సప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇవి తాగిన వెంటనే తక్షణ శక్తి లభించినట్లు అనిపించినప్పటికీ, ఈ తాత్కాలిక ఉత్సాహం వెనుక గుండెకు తీవ్రమైన ముప్పు దాగి ఉందనే హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ 2017 నుంచి 2025 వరకు సేకరించిన 28,345 ఆరోగ్య నివేదికలను విశ్లేషించగా పరిశోధకులు ఆందోళనకర విషయాలను గుర్తించారు. అధిక కెఫీన్, ఇతర స్టిమ్యులెంట్లు ఉండే ఎనర్జీ డ్రింక్స్ వాడేవారిలో సాధారణ ఉత్పత్తులతో పోలిస్తే గుండె ఆగిపోయే ఘటనలు దాదాపు 11 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. అలాగే గుండెపోటు ఘటనలు 4.5 రెట్లు, గుండె లయ తప్పడం 4 రెట్లు, గుండె వేగం పెరగడం 3 రెట్లు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తేలింది. ఈ బాధితుల్లో దాదాపు 45 శాతం మంది 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న యువతే కావడం గమనార్హం. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 400 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ తీసుకోవడం సురక్షితమని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంది. కానీ కొన్ని ఎనర్జీ డ్రింక్స్‌లో సాధారణ కాఫీ కంటే 3 రెట్లు, ప్రీ-వర్కౌట్ ఉత్పత్తుల్లో 12 రెట్లకు మించి కెఫీన్ ఉంటోంది. వీటిని మోతాదుకు మించి తాగడం, వ్యాయామాలకు ముందు తీసుకోవడం, మద్యం లేదా ఇతర పదార్థాలతో కలిపి వాడటం వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ అధ్యయనం కేవలం కెఫీన్ ఆధారిత డ్రింక్స్ వాడకానికి, గుండె సమస్యలకు ఉన్న సంబంధాన్ని మాత్రమే చూపిస్తోందని, నేరుగా అవే కారణమని నిరూపించలేదని పరిశోధకులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, డ్రింక్స్‌లోని కెఫీన్ పరిమాణం తెలుసుకోకుండా అలవాటుగా తాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఛాతినొప్పి, గుండెదడ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ గింజలు గుప్పెడు తింటే చాలు.. పండ్లు, పాలు కంటే 5 రెట్లు ఎక్కువ శక్తి!

Follow Us