AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..

పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..

Phani CH
|

Updated on: Nov 15, 2026 | 12:21 PM

Share

కర్ణాటక రాజధాని బెంగళూరులో సంతానం లేదంటూ భర్త వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ అతడిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన భర్త ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కెంపేగౌడనగర్ పోలీసులు భార్య మాలాశ్రీని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంతానం కలగడం లేదనే కారణంతో నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను, సహనం కోల్పోయిన భార్య దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజశేఖర్ , మాలాశ్రీ దంపతులు కెంపేగౌడనగర పరిధిలోని లక్ష్మీపురలో నివాసం ఉంటున్నారు. రాజశేఖర్ ఒక బ్యాంకులో రుణాల మంజూరు విభాగంలో ఉద్యోగం చేసేవాడు. వీరికి వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదు. దీంతో రాజశేఖర్ నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి, సంతానం లేదంటూ భార్యను తీవ్రంగా వేధించేవాడు. అందరి ముందు ఎగతాళి చేస్తూ, సూటిపోటి మాటలతో మానసిక క్షోభకు గురిచేసేవాడని, రోజూ ఇంట్లో గొడవలు జరిగేవని ఇరుగుపొరుగు వారు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా మద్యం మత్తులో ఉన్న రాజశేఖర్, మాలాశ్రీల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. భర్త వేధింపులు, అవమానాలతో విసిగిపోయిన మాలాశ్రీ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైంది. ఆవేశంతో వంటింట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి రాజశేఖర్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. ఇష్టానుసారం నరకడంతో అతను రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యలోనే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న కెంపేగౌడనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితురాలు మాలాశ్రీని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంజీరా నీళ్లు బంద్! సైబరాబాద్‌లో ఏం జరగబోతోంది? జనవరి నుంచి గడ్డుకాలమేనా?

పుష్ప సినిమాకు మించిన స్కెచ్‌.. మామూలుగా లేదుగా!

పండగ పేరుతో విచ్చలవిడి ఖర్చులు! ఈ తప్పు మీరూ చేస్తున్నారా?

ఇదెక్కడి గోల.. రెండేళ్ల కిందటి కరెంట్ బిల్లు ఇప్పుడు కట్టాలా?

బాసరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి కొత్త రూట్ వచ్చేసింది

Follow Us